E-Paper
Advertisement

AP Assembly Sessions 2024 : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా ?

AP Assembly Sessions 2024 : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా ?
Advertisement

AP Assembly Session updates(AP news live): నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేటితో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్‌హమీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుపడుతూ తెలుగు తమ్ముళ్ల వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది.

స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు సహకరించాలని స్పీకర్‌ చెబుతున్నా పట్టించుకోని తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు.

Advertisement

Read More : AP Assembly Sessions 2024 : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. ఏపీ అసెంబ్లీ వాయిదా

దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. అయితే.. సభ నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో మార్షల్స్‌ రంగంలోకి దిగి వారిని బలవంతంగా బయటకు పంపారు.

Advertisement

ఇక టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. దీంతో శాసనసభా సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఆందోళనకు సభ వేదికైందని.. ప్రజలకు పనికొచ్చే చర్చలు జరగకుండా ఈ రాజకీయ గందరగోళమేంటని ఆరోపిస్తున్నారు. ఇవాళ చివరిరోజైనా సభ సజావుగా జరగుతుందా..? టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమిస్తారా ? లేదంటే షరా మామూలే అన్నట్టు వైసీపీ, టీడీపీ నేతల మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×