BigTV English

Jasprit Bumrah World Record: ఐసీసీ ర్యాంకింగ్స్.. జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!

Jasprit Bumrah World Record: ఐసీసీ ర్యాంకింగ్స్.. జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
Jasprit Bumrah

Jasprit Bumrah in ICC Ranking: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు స్థానాలను ఎగబాకిన బుమ్రా నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరాడు. టెస్టు ర్యాంకుల్లో ఓ భారత పేసర్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.


బుమ్రా 881 పాయింట్లు సాధించగా.. కగిసో రబాడ (851) రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అశ్విన్‌ (841) రెండు ర్యాంకులు కిందకు పడిపోయాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడిన రవీంద్ర జడేజా (746) రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్ (828), జోష్ హేజిల్ వుడ్ (818) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

Read More : Virat Kohli : టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన టెస్టులకు కోహ్లీ దూరం ?


బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్‌ స్టార్ కేన్ విలియమ్సన్ (864) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ (760) మాత్రమే టాప్‌-10లో నిలిచాడు. విరాట్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు భారత ఆటగాళ్లవే. రవీంద్ర జడేజా (416), రవిచంద్రన్ అశ్విన్ (326) ముందు వరుసలో ఉన్నారు. అక్షర్ పటేల్ (286) ఐదో స్థానంలోకి దూసుకొచ్చాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×