Garbage Tax Cancelled by AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును రద్దు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను వసూలు చేయరని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో పెద్దఎత్తున చెత్త విపరీతంగా పేరుకుపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలోనే చెత్తను ఎత్తేయాలని ఇప్పటికే మంత్రి నారాయణకు సూచించామన్నారు.
చెత్త ఎత్తుతున్నామని, చెత్తపై పన్ను వసూలు చేసింది గత చెత్త ప్రభుత్వమని చంద్రబాబు విమర్శలు చేశారు. వేస్ట్ టై ఎనర్జీ వ్యవస్థను .. ప్లాంట్లను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. చెత్తనుంచి కరెంట్ లేదా ఎరువులు తయారు చేసేలా సూచించామని వెల్లడించారు. 2027 నాటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తామన్నారు.
2029 నాటికి రాష్ట్రం స్వచ్ఛ ఏపీగా మారాలన్నారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. నేషనల్ కాలేజీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. అలాగే పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Also Read: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!
భవిష్యత్తులో రోడ్లపై చెత్త వేయకూడదన్నారు. చెత్త పన్ను రద్దుపై కేబినేట్ తీర్మానం చేస్తామని వెల్లడించారు. కొంతమంది స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో పరిసరాలు దెబ్బతిన్నాయనిన్నారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు కృషితో అంటు వ్యాధులు వ్యాపించలేదన్నారు. అనంతరం మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.