BigTV English

R.K.Roja: ఆ స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు.. రోజా ఏమన్నదంటే..?

R.K.Roja: ఆ స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు.. రోజా ఏమన్నదంటే..?

R.K.Roja: సాధారణంగా సెలబ్రిటీలు భారీ పాపులారిటీ అందుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అంటే ఇక వారి వారసుల సినీ ఎంట్రీ గురించి అందరూ ఆలోచిస్తారు.. ముఖ్యంగా అబ్బాయిలు అయితే హీరోలుగా.. ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని, అదే అమ్మాయిలైతే ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నలు గుప్పించిన సందర్భాలు కూడా అనేకం.అయితే సెలబ్రిటీల పిల్లలందరూ కూడా ఇండస్ట్రీలోకే వస్తారన్న రూల్ ఏమీ లేదు. కొంతమంది తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్ , మాజీ మంత్రి రోజా (Roja) కుమార్తె అన్షు మాలిక (Anshu Malika)ఇండస్ట్రీలోకి రాకపోయినా భారీ పాపులారిటీ అందుకుంది.


ఆ స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..

అన్షు మాలిక రోజా – సెల్వమణి దంపతుల కుమార్తె. వీరికి కృష్ణ లోహిత్ అనే కుమారుడు కూడా ఉన్నారు. పిల్లలు ఇద్దరు కూడా ఉన్నత చదువులలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక అన్షు విషయానికి వస్తే.. అందంలో తల్లిని మించిపోయింది.అప్పుడప్పుడు తల్లితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.అన్షు మాలిక అందం విషయంలోనే కాదు తెలివితేటల విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాదు అన్షు మాలికలో గొప్ప రచయిత కూడా ఉన్నారు..ఇదిలా ఉండగా అన్షు మాలిక గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతుందంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా రోజా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కుమార్తె పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.


వార్తలపై రోజా కామెంట్స్..

ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా మీ కుమార్తె ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోందా? అంటూ ప్రశ్నించగా.. రోజా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ నిరాధారం అని ఆమె కొట్టిపారేశారు. ప్రస్తుతం అన్షు చదువుకోడానికి అమెరికా వెళ్ళింది. అయితే తాను ఇండస్ట్రీలోకి రాబోతోందని, కొంతమంది డాన్స్ కోసం, నటనలో శిక్షణ తీసుకోవడం కోసం ఫారిన్ వెళ్ళిందని వార్తలు రాస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఒకవేళ ఆమె యాక్టర్ కావాలనుకుంటే మాకు సంతోషమే. కానీ నా కూతురికి సైంటిస్ట్ కావాలన్నదే కల.అందుకే ఆమె ఇష్ట ప్రకారమే ఆమెను వదిలేసాం. ప్రస్తుతం ఆమె తన లక్ష్యాన్ని చేదించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మా అభిప్రాయాలను మేము మా పిల్లలపై రుద్దాలని అనుకోవట్లేదు. వారి తెలివితేటలకి అనుగుణంగా వారు ఏ రంగంలో అయితే సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నారో వారిని ఆ దిశ గానే ప్రోత్సహిస్తాము అంటూ రోజా తెలిపింది. మొత్తానికైతే అన్షు మాలిక పెళ్లి వార్తలను కొట్టి పారేసింది రోజా.

రోజా కెరియర్..

ఇక రోజా విషయానికి వస్తే.. ఒకవైపు హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒక వెలుగు వెలిగిన ఈమె, ఆ తర్వాత రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకుంది. 2014, 2019 ఎన్నికలలో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన రోజా, ఏపీఐఐసీ చైర్పర్సన్ గా, మంత్రిగా కూడా సేవలు అందించింది. ఇక ఈసారి ఎన్నికలలో ఓటమిపాలయ్యింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×