CM Chandrababu Naidu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 నుంచి వరుసగా 30 ఏళ్లుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
సముద్రంలో వృథాగా కలిసే నీటిని వినియోగించుకునేందుకు ఎవరి అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరతామన్నారు. వారంలో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని, కరెంట్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. విద్యాసంవత్సరం మొదలవకముందే మెగా డీఎస్సీ నియామకం పూర్తవుతుందన్నారు.
సోషల్ మీడియాలో ఆడబిడ్డలను వేధిస్తే సహించబోమని.. వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా వార్నింగ్ ఇచ్చారు. నేరస్థుల్లారా ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగవు అని సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే వలస పక్షులు వస్తుంటాయి.. వెళ్తుంటాయి… కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని సీఎం చెప్పారు. రెండో రోజు మహానాడు సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నేరస్థులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కోవర్టులుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆ కోవర్టుల వల్లే ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన వేలుతోనే మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డపేరు తెచ్చి.. సులభంగా వారి టార్గెట్‌లను హత్య చేస్తున్నారని కోవర్టులపై సీఎం ఫైరయ్యారు.
రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఏ కార్యకర్త కూడా తప్పుడు పనులు చేయొద్దని హెచ్చరించారు. కొందరు కోవర్టులను తెలుగుదేశం పార్టీలోకి చేర్చి.. ఆ కోవర్టుల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదని అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణం హత్య చేశారు. ఆ తర్వాత గుండెపోటు అని చెప్పారు. కానీ రెండవ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్‌లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి నరరూప రాక్షసులతో రాజకీయం చేయాల్సి వస్తుందని చెప్పారు. పల్నాడులో దారుణ హత్యలు చేస్తున్నారని.. వీటిపై తనకు అనుమానం కలిగిందని చెప్పారు.
ALSO READ: CM Revanth Reddy: వందేళ్ల చరిత్రలోనే తొలిసారి.. ఇది మా ఘనత: సీఎం రేవంత్ రెడ్డి
పల్నాడు జిల్లాలో వీరయ్య చౌదరి హత్య తరువాత.. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదని అన్నారు. వలస పక్షులు వస్తుంటాయి.. వెళ్తుంటాయి… కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని సీఎం చెప్పారు. పార్టీ బలోపేతం కావాలని.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బంధీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించబోమని.. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం ఫైరయ్యారు.
ALSO READ: Jr.NTR: ఎన్టీఆర్‌కు చంద్రబాబు కీలక బాధ్యతలు.. ఇక నుంచి తారక్‌కు పదవి ఇదే..?