Kamal Hassan: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Hassan)ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. కమల్ హాసన్ నటించిన”థగ్‌లైఫ్ సినిమా” (Thug Life) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫ్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Sivaraj Kumar) కూడా నటించారు. ఇక ఈ వేడుకకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ కన్నడ భాష (Kannada Language)గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. నా జీవితం నా కుటుంబం తమిళ భాష అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. అయితే వేదికపై ఉన్నటువంటి శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ.. శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఈయన నా కుటుంబ సభ్యుడే. అందుకే ఈరోజు ఆయన ఇక్కడే ఉన్నారు అందుకే నేను ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు నా కుటుంబం, నా జీవితం తమిళ భాష అంటూ మాట్లాడాను. మీ కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందే అందుకే మీరు కూడా మా కుటుంబ సభ్యులే అంటూ మాట్లాడానని కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి . కన్నడ భాష తమిళం నుంచి పుట్టడం ఏంటి? కన్నడ భాషకంటూ ఒక చరిత్ర ఉంది అంటూ కన్నడ చిత్ర ప్రేమికులు కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఆయన నటించిన థగ్‌లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
కన్నడ చరిత్ర నీకేం తెలుసు…
ప్రస్తుతం ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కమల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… కన్నడ భాష పై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. మా కన్నడ భాష పుట్టుకకు తమిళంతో ఏమాత్రం సంబంధం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. కన్నడ భాషకు ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది.. పాపం ఆ చరిత్ర గురించి కమల్ హాసన్ కు తెలియకనే అలా మాట్లాడారంటూ సిద్ధరామయ్య కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.
ఇక్కడ వ్యాపారాలు మాత్రమే కావాలి…
కమల్ హాసన్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందు ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో ఈ సినిమా చిక్కుల్లో పడిందని చెప్పాలి.బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు తగలబెట్టారు. మీరు వ్యాపారాలు చేసుకోవటానికి కర్ణాటక కావాలి కానీ… కన్నడ భాష పై ఏమాత్రం గౌరవం లేకుండా ఇలా అవమానిస్తారా అంటూ మండిపడటమే కాకుండా ఈ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.