E-Paper
Advertisement

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?
Advertisement

America: ఏపీలో ప్రజల తరపున వైసీపీ వాయిస్ రైజ్ చేయకున్నా, ఆ పార్టీ నేతలు ఏదో విధంగా హైలైట్ అవుతున్నారు. చివరకు ఆ  పార్టీ పరువు తీసేస్తున్నారు. తాజాగా మానవ అక్రమ రవాణా కేసులో వైసీపీకి చెందిన ఓ ఎన్నారైకు అమెరికా న్యాయస్థానం ఏకంగా 50 నెలలు జైలు శిక్ష విధించింది.

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై

ఏపీకి చెందిన ఎన్నారై సత్తారు వెంకటేశ్‌రెడ్డికి అమెరికా న్యాయస్థానం 50 నెలలు జైలు శిక్ష విధించింది. పల్నాడు జిల్లా చీకటీగలపాలెం గ్రామానికి చెందిన పుల్లారెడ్డిని ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేత సత్తారు పుష్పారెడ్డి కొడుకు వెంకటేశ్‌రెడ్డి నాలుగేళ్ల కిందట అమెరికా తీసుకెళ్లాడు. వెంకటేష్ రెడ్డి వయస్సు 38 ఏళ్లు. పుల్లారెడ్డి ఇంటర్‌ పూర్తిచేయడంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, అక్కడకు తీసుకెళ్లాడు. అమెరికాలోని మిస్సోరిలో ఉంటున్న వెంకటేశ్‌రెడ్డి ఇల్లు, కంపెనీలో పనులు చేసేవాడు. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది.

వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష

Advertisement

ఇదే క్రమంలో నిఖిల్, శ్రవణ్‌ అనే వ్యక్తులతో కలిసి పుల్లారెడ్డి పట్ల అమానుషంగా వ్యవహరించాడు వెంకటేష్‌రెడ్డి. ఇమిగ్రేషన్‌ పత్రాలు లాక్కోని రకరకాలుగా హింసించారు. ఒక్కోసారి ఆయుధాలతో దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఉండేవి. నెలల తరబడి సాగిన వేధింపులతో సదరు యువకుడి ఎముకలు విరిగి నడవలేని స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో అమెరికన్ పోలీసులు దాడి చేసి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మానవ అక్రమ రవాణా , బలవంతపు కార్మికుల చట్టాల ఉల్లంఘన వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు.

సదరు వ్యక్తితో పార్టీతో సంబంధం లేదని వైసీపీ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై 2023లో అమెరికాలో కేసు నమోదైంది. ఈ ఘటనపై అక్కడి న్యాయస్థానం విచారణ జరిపింది. వైసీపీ నేత వెంకటేశ్‌రెడ్డికి 50 నెలల జైలుశిక్ష విధించింది. సహ నిందితులు 30 ఏళ్ల నిఖిల్‌‌కు 37 నెలల జైలు, 26 ఏళ్ల శ్రవణ్‌‌కు 30 నెలల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం. అమెరికా సైన్యంలో మాజీ ఉద్యోగి అయిన వెంకటేశ్‌రెడ్డి.. తన వైకల్యాన్ని చూపించి అక్కడి ప్రభుత్వం నుంచి 83,776 డాలర్లు అదనంగా పొందినట్టు దర్యాప్తులో గుర్తించారు అధికారులు.

Advertisement

ALSO READ: పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

ఫలితంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి 74,634 డాలర్లు, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వెటరన్స్‌ ఎఫైర్స్‌కు 83,776 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ కేసుతో తమకు సంబంధం లేదని అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. నిందితుడు ఎన్నారై వెంకటేష్ రెడ్డికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన అప్పుడే విడుదల చేసిన విషయం తెల్సిందే.

Related News

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

Big Stories

Advertisement
×