Rapthadu Encounter: రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసుపై హైకోర్టులో విచారణ చేసింది. రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసులో ముద్దాయి కాళ్లు తొలగించిన వ్యవహారంపై హైకోర్టులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ముద్దాయి కాళ్లు తొలగించడంపై దాఖలైన పిటిషన్‌పై నేడు వాదనలు కోర్టు వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు ఆరా తీసింది. రిజర్వ్ చేశారా? ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ కేసులో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచనలు చేసింది. ఈ కేసులను తదుపరి విచారణను డిసెంబర్‌కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో ఈ సంఘటనకుచ సంభందించిన మరిన్ని అంశాలను వచ్చే నెలలో విచారన చేయనున్నట్టు కోర్టు క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో గత కొన్ని రోజు కింద సంచలనం సృష్టించిన కేసు రాప్తాడు నిందింతుడి ఎన్ కౌంటర్ విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది ప్రవర్తించి ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించి నిందితుడుని పట్టుకుని కాల్పులు జరిపారు. దీంతో రాష్టవ్యాప్తంగా ఈ వార్త సంచనలం రేపింది.
Also Read: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?