AP Schemes: ఏపీలో తల్లికి వందనం స్కీమ్ కు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపులు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమలైన ఈ స్కీమ్ కు కూటమి పథకం కొత్త విధానంతో అమలు చేసేందుకు అడుగులు వేసింది. అది కూడ గత ప్రభుత్వం మాదిరి కాకుండ కొత్త తరహాలో తల్లికి వందనం పేరుతో పథకం అమలుకు సంబంధించి పలు మార్పులు చేసింది. ఇంతకు ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే విషయం ఓ క్లారిటీ రావడంతో, విద్యార్థుల తల్లులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అందులో ప్రధానంగా తల్లికి వందనం స్కీమ్ గురించి సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాలో తొలి ఏడాది రూ. 15 వేలు జమ చేసింది. మరలా రూ. 14 వేలు జమ చేసింది. అయితే ఇంటికి ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం అమలు చేసింది.
అయితే ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో పథకం ద్వార లబ్ది చేకూర్చనున్నట్లు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే పథకంపై క్లారిటీ రాకపోవడంతో వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు రావడంతో వరదసాయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం తల్లికి వందనం అమలుపై ఓ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం.
ఈ పథకంపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఈ ఏడాది మే నెలలో పథకం అమల్లోకి వస్తుందని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పథకంతో ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందని మంత్రి ప్రకటించారు.
Also Read: Tirumala Updates: తిరుమల వెళ్తున్నారా.. ఈ సమాచారం తప్పక తెలుసుకోండి
దీనితో విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నుండి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు. తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి స్వామి క్లారిటీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడా అంటూ విద్యార్థుల తల్లులు ఎదురు చూపులకు మే నెలలో శుభం కార్డు పడుతుందని చెప్పవచ్చు. మరి రూ. 15 వేల కోసం అప్పటివరకు ఆగాల్సిందే!