BigTV English

AP Govt. forms SIT on Violence: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు!

AP Govt. forms SIT on Violence: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు!

AP Govt. to form SIT for Post Election Violence: ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ ను వేయనున్నది.


రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేసి నివేదిక ఇవ్వనున్నది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి ఘటనలపై సిట్ విచారణ చేయనున్నది. ఈ ఘటనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారించనున్నది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లను కూడా సిట్ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో అల్లర్లు జరగడానికి కారణాలు ఏంటి? వాటికి ఎవరు బీజం వేశారు..? చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారడానికి గల కారణాలు ఏమిటి..? ఇలా ప్రతి అంశంపై సిట్ పూర్తి విచారణ జరపనున్నది.

అదేవిధంగా విశాఖపట్నంలో తాజాగా చోటు చేసుకున్న ఘటనను కూడా సిట్ పరిధిలోకి తీసుకొచ్చే విషయమై తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలపై సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఏర్పాటు చేసే సిట్ ను ఉన్నతాధికారి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సిట్ ను వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలపై పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నది.


Also Read: మరో 5 రోజులు కుండపోతే.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

కాగా, పలు ఘటనల్లో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే పలువురిని ఈసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా… ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యరదర్శి, డీజీపీని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు ఢిల్లీకి వెళ్లి వారు కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన విషయం తెలిసింది. అనంతరం హింసాత్మక ఘటనలకు సంబంధించిన వివరాలను కూడా వారికి వివరించిన విషయం విధితమే.

అయితే, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన మరుసటి రోజే పలు చోట్లా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నేడు విశాఖలో కూడా ఓ హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×