BigTV English

Anantapur : ఒత్తిళ్లకు బలి! కలవరపెడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వరుస మరణాలు..

Anantapur : ఒత్తిళ్లకు బలి!  కలవరపెడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వరుస మరణాలు..
ap latest news

Anantapur news today(AP latest news):

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. మొన్న తాడిపత్రి సీఐ ఆనందరావు.. ఆ తర్వాత రిజిస్ట్రార్ నాగభూషణం.. తహసీల్దార్ భాస్కర్ నారాయణ.. బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు ఉన్నతాధికారులు వరుసగా మరణించడంతో ఎందుకిలా జరుగుతోందనే చర్చ మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.


మొదట తాడిపత్రి సీఐ ఆనందరావు తో ఈ ఆత్మహత్య ల పరంపర స్టార్ట్ అయ్యింది. ఇంట్లో ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజకీయ ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఇది రాజకీయ దుమారానికి తెర తీసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ నాగభూషణం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయమని కొందరు నాయకులు ఒత్తిడి చేశారని ఆయన ఒప్పుకోకపోవడంతో.. ఏసీబీ తనిఖీలు చేయించి, ఒత్తిడి పెంచి సస్పెండ్ చేపించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నారనే వాదన వినిపించారు. మొదట అందరూ గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు. కానీ బాత్రూంలో కాలుజారి పడి చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో జిల్లా అధికారులంతా షాక్ గురయ్యారు.


అనంత జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆయనపై కాంట్రాక్టర్ల ఒత్తిడి కారణమని తెలుస్తోంది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల విషయంలో నోటీస్ లు ఇవ్వటంతో ఆయనపై ఒత్తిడి అధికమయ్యింది. మానసికంగా కుంగిపోయి.. బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీసింది అని విద్యాశాఖ సిబ్బంది అన్నారు.

పుట్టపర్తి, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో తహసీల్దారుగా పనిచేసిన భాస్కర్ నారాయణ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే తనువు చాలించారు. కొన్ని రోజులుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. కారణం లేకుండా సస్పెండ్ చేశారంటూ ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఇటు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోపానికి గురయ్యారని.. ఇదే ఆయన మరణానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఒత్తిడితో అధికారులు బలవుతుండడంతో మిగతా ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ఓటర్ల తొలగింపులో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అవడంతో అధికారులు మరోసారి ఆలోచనలో పడ్డారు .

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×