AP DSC Syllabus: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. ఎప్పటికే డీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టారా.. అయితే మీలాంటి అభ్యర్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అది కూడా డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ అప్ డేట్ అని చెప్పవచ్చు.
ఏపీలో కూటమి ప్రభుత్వం విజయాన్ని అందుకున్న వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనితో నోటిఫికేషన్ గురించి ఎదురు చూపుల్లో ఉన్న అభ్యర్థులు ఆనందపడ్డారు. అయితే ప్రభుత్వం ఏర్పడడడం, వరదలు రావడంతో నోటిఫికేషన్ కు సంబంధించిన వ్యవహారం కాస్త ఆలస్యమైంది. దీనితో అసలు ప్రభుత్వం ప్రకటన ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపుల్లో ఉన్న పరిస్థితి అభ్యర్థులది. ఓ వైపు విద్యా శాఖ మంత్రిగా గల నారా లోకేష్ పలు మార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు.
ఈ తరుణంలో అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. కోచింగ్ సెంటర్లకు వేలకొద్ది ఫీజులు చెల్లించి, ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. దీనితో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని, ఇక పుస్తకాల కుస్తీలో మరింత స్పీడ్ పెంచారు.
Also Read: Rajya Sabha: జనసేన 1, టీడీపీ 2.. రాజ్యసభకి వెళ్లేది వీళ్లే..?
కాగా మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబస్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. అది కూడా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయగా, నోటిఫికేషన్ కూడా అతి త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ సిలబస్ కోసం అభ్యర్థులు http://apdsc2024.apcfss.in వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు, అన్ని వివరాలు ప్రభుత్వం అందులో పొందుపరిచింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరి మీరు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నారా.. అయితే ఆలస్యం చేయవద్దు.. సిలబస్ చెక్ చేసుకోండి.. ప్రిపేర్ కండి.. జాబ్ ఇలా పట్టేసేయండి.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!