BB Telugu 8 Promo: ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ చివరి దశకు చేరుకోబోతోంది. మరో రెండు మూడు వారాలు గడిస్తే షో కూడా కంప్లీట్ అవుతుంది.. ఈ నేపథ్యంలోనే 12 వారాలు పూర్తి చేసుకోగా.. 13వ వారం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇకపోతే నామినేషన్స్ లో భాగంగా మెగా చీఫ్ రోహిణి మినహా.. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, అవినాష్ ఇలా మొత్తం ఎనిమిది మంది 13వ వారం నామినేషన్స్ లోకి వచ్చేసారు. ఇకపోతే మరోవైపు “టికెట్ టు ఫినాలే” టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఇక నిన్న దేత్తడి హారిక(Dettadi Harika), అఖిల్ (Akhil ) గెస్ట్లుగా వచ్చి.. రెండు టాస్క్లను నిర్వహించగా.. అందులో ఒక టాస్క్ లో రోహిణి , రెండవ టాస్క్ లో గౌతమ్ విజేతలుగా నిలిచారు.
ఇక 87వ రోజుకు సంబంధించి తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇక ఈవారం జరిగిన ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ లుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయినా మానస్ తో పాటు ప్రియాంక జైన్ అతిథులుగా వచ్చారు. బిగ్ బాస్ మాట్లాడుతూ..” మీలో నుంచి ఒకరు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి మొదటి ఫైనలిస్ట్ గా నిలవడానికి మరొక కంటెండర్ ని ఎంపిక చేయడానికి మానస్, ప్రియాంక జైన్ వచ్చారు. ఎవరైతే ముందుగా సుడోకో ను సాల్వ్ చేస్తారో.. వారు ఈ చాలెంజ్ విజేతలుగా నిలిచి, ఒక పెద్ద ప్రయోజనాన్ని పొందుతారు” అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.
ఇక పృథ్వీ , నబీల్, ప్రేరణ, అవినాష్ నలుగురు కూడా టాస్క్ ఆడడానికి ముందుకు వచ్చారు. ఇకపోతే నబీల్ టాస్క్ పూర్తి చేశానని గంట తీసుకొని సంబరపడుతూ శబ్దం చేశాడు. కానీ నబీల్ పూర్తి చేసిన సుడోకో ని చెక్ చేయగా.. అందులో నాలుగు కరెక్ట్ , నాలుగు తప్పు అన్నట్టు తేల్చేశారు మానస్. ఇక తర్వాత పృథ్వీ తన టాస్క్ కంప్లీట్ చేసి గంట మోగించే ముందు విష్ణు ప్రియ ఒకసారి చెక్ చేసుకోండి అంటూ గట్టిగా అరిచింది. అలా ఎవరూ కూడా టాస్క్ ను కంప్లీట్ చేయలేక పోతారు.
ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు ఎవరు ఛాలెంజ్ సరిగా పూర్తి చేయనందు వల్ల మీకు బిగ్ బాస్ మరొక్క క్లూ ఇస్తున్నాడు అంటూ తెలిపారు. మిడిల్ లో 5 నెంబర్ ఉండాలి అంటూ తెలిపారు. ఇక మొదట అవినాష్ టాస్క్ పూర్తి చేయగా.. ప్రేరణ, పృథ్వి గంట కోసం పోటీపడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత నబీల్.. తేజ నువ్వేమైనా సహాయం చేసావా..? అడగ్గా అవినాష్ నబీల్ అంటూ అరిచాడు. ఇక వెంటనే ఏమో అక్కడ జనాలు ఉన్నారు కదా అంటూ తెలిపారు. దాంతో ప్రోమో కాస్త ఎండ్ అవుతుంది. మొత్తానికైతే ఈ టాస్క్ కంటెస్టెంట్స్ తెలివితేటలపై ఆధారపడిందని చెప్పవచ్చు.