BigTV English

Guntur Police: రౌడీలను పిచ్చకొట్టుడు కొట్టిన పోలీసులు.. నడిరోడ్డు పైనే కోటింగ్..

Guntur Police: రౌడీలను పిచ్చకొట్టుడు కొట్టిన పోలీసులు.. నడిరోడ్డు పైనే కోటింగ్..

Guntur Police: నడిరోడ్డుపై అలజడి. చుట్టూ జనం గుంపుగూడారు. మధ్యలో పోలీసులు, రౌడీ షీటర్లు. అక్కడ ఏం జరుగుతోందోనని అంతా ఆతృతగా చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ సెల్‌లో ఇచ్చే కోటింగ్.. రోడ్డు మధ్యలో ఇస్తున్నారు. ఓ రౌడీని నేలపై పడుకోబెట్టారు. సీఐ లాఠీ తీసుకున్నాడు. అరికాళ్లపై రప్పారప్పా బాదుతున్నాడు. వామ్మో వామ్మో అంటూ ఆ రౌడీ నొప్పితో అరుస్తున్నాడు. అయినా వదలలేదు పోలీసులు. లాఠీలతో పట్టా పట్టా కొట్టారు. ఆ రౌడీకి ఓ రౌండ్ అయిపోయాక.. మరో రౌడీని పిలిచారు. అతన్నీ అలానే రోడ్డుపై పడేసి అరికాళ్లు వాయగొట్టారు. అలా ముగ్గురు రౌడీల తాట తీశారు తెనాలి ఖాకీలు. ఎందుకంటే…


గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో రౌడీషీటర్ల రెచ్చగొట్టే ప్రవర్తనకు పోలీసులు చెక్ పెట్టారని స్థానికుల మాట. ఒక కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని నడిరోడ్డుపై నిలబెట్టి ఊహించని రీతిలో అరికాలి కోటింగ్ ఇచ్చారు తెనాలి టు టౌన్ సీఐ రాములు నాయక్. ఇది ఇప్పుడు తెనాలి నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలోకి వెళితే.. నెల రోజుల క్రితం తెనాలి సమీపంలోని ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవి తన విధుల్లో నిమగ్నంగా ఉన్న సమయంలో, అతడిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి అనంతరం చిరంజీవి సున్నితంగా వ్యవహరించకుండా, చట్టపరమైన రీతిలో ఫిర్యాదు చేశారు.


దాడికి పాల్పడిన వారిలో రౌడీషీటర్స్ లడ్డూ అనుచరులైన విక్టర్, బాబూలాల్, రాకేష్ అనే ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసిన తెనాలి టూ టౌన్ పోలీసులు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. వారి మూమెంట్స్‌పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన నిందితులను తిరిగి ఘటనాస్థలమైన ఐతానగర్‌కు తీసుకెళ్లిన పోలీసులు, అక్కడే ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై వారిని నిలబెట్టి అరికాలిపై దడబడేలా చేశారు. దీనిని పోలీసులు అరికాలి కోటింగ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ చర్య ద్వారా పోలీసుల ఉద్దేశం నిందితులను లొంగదీసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చెంపచాటు సందేశాన్ని పంపడమేనని కొందరి వాదన.

ఈ విధంగా నడిరోడ్డుపై తీసుకున్న చర్యపై స్థానికంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రజలు పోలీసుల తక్షణ చర్యను ప్రశంసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో యువత గంజాయి మత్తులో తప్పుచేస్తున్నారు. ఇటువంటి కోటింగ్‌లు తప్పదని ప్రజలకు తెలిసి ఉండాలని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.

మరోవైపు, కొందరు మాత్రం పోలీసుల చర్యపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చట్టపరంగా ముందుకెళ్లకుండా ఇలా ప్రజల సమక్షంలో కస్టడీలో ఉన్న నిందితులపై వేధింపులు మంచివా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ఆ యువకుల్లో మార్పు తీసుకురావడం బదులు.. ఇదేం పిచ్చ కోటింగ్ అంటూ కొందరు అక్కడే గుసగుసలాడుకున్నారు. అయితే దీనిపై పోలీసుల వాదన సరైనదేనని మరికొందరు గట్టిగా వాదిస్తున్నారు.

Also Read: AP Tourist Place: ఏపీలో వర్షాలు.. ఈ ప్లేస్ కు వెళ్లారో.. నీటితో మాట్లాడే ఛాన్స్!

తాజాగా తెనాలి పోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు “ఈ విధంగా కోటింగ్ ఇస్తేనే గంజాయి నియంత్రణ సాధ్యమవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ చర్య ద్వారా పోలీసు వ్యవస్థపై భయం పెరుగుతుంది. అది మంచిదే అని అంటున్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, అవసరమైతే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించే వారి మీద నిరంతరం నిఘా పెట్టి, ప్రజల్ని బాధించే వారిపై శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకోకుండా ఉండాలంటే, యువతలో మత్తుపదార్థాల వ్యసనానికి బ్రేక్ వేయడం పోలీసు, ప్రజల మధ్య అవగాహన పెంచడం అత్యవసరం. తెనాలిలో జరిగిన ఈ సంఘటన ఒక పాఠంగా మారుతుందా? ఇంకా వివాదంగా మారుతుందా అన్నది వేచి చూడాలి.

అయితే కొసమెరుపు ఏమిటంటే, మరికొందరు కానిస్టేబుల్ చిరంజీవిపై పలు ఆరోపణలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో వేదికగా వైరల్ చేస్తున్నారు. ఏదిఏమైనా పోలీసులు తీసుకున్న చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ విషయంలో ఏం జరిగిందనే కోణంలో పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు ఆరా తీస్తున్నారని సమాచారం. కాగా ఎప్పుడో జరిగిన ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకు ఏది నిజమన్నది మాత్రం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×