BigTV English

TDP Leaders: టీడీపీ సీనియర్లు సైలెంట్! పదవుల కోసమా?

TDP Leaders: టీడీపీ సీనియర్లు సైలెంట్! పదవుల కోసమా?

TDP Leaders: తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఎక్కడ చూసినా వారి పేర్లే వినిపించేవి. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రత్యర్ధులకు కౌంటర్ ఇవ్వడంలో గుంటూరు జిల్లా సీనియర్లు ముందుండే వారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఆ టీడీపీ సీనియర్లు పెద్దగా యాక్టివ్ అవ్వడం లేదు. పార్టీ, ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. అధిష్టానం మీద అలకో? అసంతృప్తో కాని కానీ మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనం దాలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు వారు అలా సైలెంట్ అవ్వడానికి కారణమేంటి?


ప్రత్యర్ధులకు ధీటుగా కౌంటర్ ఇచ్చే గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్లు

తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా ఎక్కడైనా విమర్శలు చేసినా? అధినేతపై ఏదైనా అన్నా? పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడ్లాలన్నా మొదటగా స్పందించే నేతల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ సీనియర్ నేతలు పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా కూడా పేరుగాంచిన నేతలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీలో చాలామంది ఉన్నారు. కౌంటర్ ఇవ్వాలన్న.. విమర్శ చేయాలన్న వారి స్లైల్ ప్రత్యేకతంగా ఉండేది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్లు ముందు వరుసగా ఉండేవాళ్ళు.


కొంత కాలంగా సైలెంట్ అయిన టీడీపీ సీనియర్లు

అలాంటి నేతలు ప్రస్తుతం ఎందుకో కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ, ఈ ఏడాది పరిపాలనలో ఏం చేసామో ప్రజలకు వివరిస్తూ నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్లు ఏడాది పాలనకు సంబంధించిన అంశాలపై మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఓ వైపు జిల్లాలోని వైసీసీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజనీ వంటి వారు ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి కౌంటర్లు ఇవ్వడానికి కూడా టీడీపీ సీనియర్లు ముందుకు రాకపోతుండటం చర్చనీయాంశంగా మారింది.

పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు

కూటమి ప్రభుత్వం ఏర్పడి, క్యాబినెట్ ఏర్పాటైన దగ్గర నుంచి జిల్లాలోని సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం పార్టీ అధికారంలోకి రాగానే వారు ఊహించిన విధంగా పదవులు రాకపోవటమే అంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో జిల్లాకు ప్రయారిటీ ఉండేది.. అయితే జరుగుతున్న పరిణామాలు పార్టీలో వస్తున్న మార్పులతో జిల్లాలోని పార్టీ సీనియర్లను పక్కన పెట్టేశారు. సముచిత స్థానాలు కల్పిస్తామని చెప్పిన అధిష్టానం పట్టించుకోకపోతుండటం .. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారని వారి అనుచరులే అంటున్నారు.

Also Read: అడ్డంగా ఇరుక్కున్న పేర్ని నాని.. అరెస్ట్ తప్పదా?

మంత్రి పదవితో సీనియర్టీకి గుర్తింపు వస్తుందని ఆశలు

టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా అసలు తర్వాత తమకు అవకాశాలు వస్తాయో రావో ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడే తాము మంత్రులమైతే తమ సీనియారిటీకి ఒక ప్రాధాన్యత ఉంటుందని సన్నిహితులతో అంటున్నారంట . భవిష్యత్తులో మాజీ మంత్రి అనే పేరన్నా మిగులుతుందని ఆశపడుతున్నారంట. అయితే ఆ విషయాన్ని అధిష్టానం ముందు వెల్లడించలేక, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారంట.

Related News

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

Big Stories

×