BigTV English

Sukumar Emotional:ఫాదర్స్ డే స్పెషల్.. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఏడ్చేసిన సుకుమార్.. వీడియో వైరల్!

Sukumar Emotional:ఫాదర్స్ డే స్పెషల్.. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఏడ్చేసిన సుకుమార్.. వీడియో వైరల్!

Sukumar Emotional: ఫాదర్స్ డే.. ప్రతి ఏడాది ఈ ఫాదర్స్ డేని అటు సామాన్యులే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే సెలబ్రిటీలు మాత్రం ఈ సారి ఒక రెండు రోజుల ముందే జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే మెగా డాటర్ నిహారిక (Niharika) నిన్నటికి నిన్న తన తండ్రి నాగబాబు(Nagababu) తో కలిసి ప్లేట్లో మామిడి పళ్ళ ముక్కలు పెట్టుకొని ఫోటోలకు సెల్ఫీ ఇస్తూ.. ఫాదర్స్ డే ముందుగానే వచ్చేసింది అంటూ తన తండ్రికి ఫాదర్స్ డే స్పెషల్ విషెష్ చెప్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా స్టోరీ షేర్ చేసింది. మరొకవైపు డైరెక్టర్ సుకుమార్ (Sukumar ) కి ఆయన పిల్లలు ఫాదర్స్ డే స్పెషల్ గా ఇచ్చిన గిఫ్ట్ చూసి డైరెక్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


వెకేషన్ లో సుకుమార్ ఫ్యామిలీ..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు సుకుమార్ (Sukumar ). ‘ఆర్య’ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ‘పుష్ప 2’ తో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అందించింది. పుష్ప 2 సినిమా అందించిన సక్సెస్ తో కాస్త ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న సుకుమార్..ప్రస్తుతం తన కుటుంబానికి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల ఆయన పెళ్లిరోజు కావడంతో భార్యా పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. తాజాగా 16 ఏళ్ల వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కి వెళ్ళిన వీరు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ భార్య తబిత (Tabita) “దేవుడు మమ్మల్ని ఒక్కటిగా కలిపి ఉంచారు” అంటూ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసి అటు, అభిమానులు ఇటు సెలబ్రిటీలు నెటిజన్స్ అందరు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఫాదర్స్ డే స్పెషల్..

ఇదిలా ఉండగా వీరు ఆ వెకేషన్ లోనే ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా తబితా షేర్ చేసిన వీడియోలో తమ పిల్లలు ఇద్దరు చాలా చక్కగా పెయింటింగ్ వేశారు. అందులో అమ్మానాన్నతో పాటు వారిద్దరి ఫోటోలు కూడా పెయింట్ వేసి తన తండ్రిని సర్ప్రైజ్ చేశారు. ఇకపోతే తల్లిదండ్రులకు మ్యారేజ్ యానివర్సరీ సర్ప్రైజ్ తో పాటు ఇలా ముందుగానే ఫాదర్స్ డే సర్ప్రైజ్ కూడా ఇచ్చి సుకుమార్ కి ఫాదర్స్ డే తెలియజేశారు. ఇకపోతే పిల్లలు గీసిన ఆర్ట్ చూసి.. నెటిజన్స్ పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా? అంటూ ముచ్చట పడిపోతున్నారు. మొత్తానికైతే తబిత షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:Samantha: సీక్రెట్ రిలేషన్ షిప్ పై సమంత కామెంట్.. రాజ్ వైఫ్ కి గట్టి కౌంటర్!

తండ్రికి తగ్గ కూతురు..

ఇక సుకుమార్ విషయానికి వస్తే.. దర్శకుడు కాకముందు గణిత అధ్యాపకుడిగా పనిచేశారు. ఇక సినిమా మీద ఇష్టంతోనే రచయితగా మారి, ఆ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘ఆర్య’ సినిమా చేసి డైరెక్టర్గా సక్సెస్ అందుకున్నారు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అద్భుతమైన డైరెక్షన్తో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ కూతురు సుకృతవేణి (Sukruthaveni ) ఇటీవల ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమాలో అద్భుతంగా నటించింది.ఈ సినిమాతో ఉత్తమ బాలనాటిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలను కూడా సుకృతి సొంతం చేసుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×