Madamapalle Student Incident: విద్యాసంస్థల ఆగడాలు రోజు రోజుకి మితిమీరి పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో శ్వేతశ్రీ చందు అనే ఫార్మసీ విద్యార్థి.. ఫీజు కట్టకపోతే అవమానిస్తారా? ఫోటోలు తీసి పరువు తీస్తారా? ఇక నావల్ల కాదు, భరించలేను, చచ్చిపోతున్నా అంటూ లేఖ రాసి అదృశ్యమైపోయింది.
ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో జరిగింది. అయితే శ్వేత శ్రీ ఫీజుల కోసం వేధిస్తున్నారని.. క్లాస్‌లో నిలబెట్టి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారని లేఖలో తెలిపింది. దీంతో ఆమె మనస్థాపానికి గురై శనివారం రోజు తన తల్లిదండ్రులకు ఉత్తరం రాసి.. అక్కడి నుంచి అదృశ్యమైనట్లు సమాచారం తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మహతి ఆచూకీ పోలీసులకు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని గంటలు ఎక్కడికి వెళ్లిందని పోలీసుల ఆరా తీస్తున్నారు. మహతి వెళ్లిపోవడానికి కాలేజీ యాజమాన్యమే.. కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: టెక్సాస్ ఆగమాగం.. 50 మంది చిన్నారులు గల్లంతు!
తంబళ్లపల్లికి సంబంధించిన సూర్యనారాయణ, సుజాత దంపతులకు చెందిన శ్వేత మదనపల్లి మహతి ఫార్మసీ కళాశాలలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే యాజమాన్యం ఈ దృశ్యంపై ఇప్పటికి స్పందించలేదు. దీనికి సంబంధించి మదనపల్లి రూరల్ పోలీసులకు కేసు నమోదు చేశారు. మొత్తం మీద ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించినవారు ఫీజుల విషయం తల్లిదండ్రులను నేరుగా ప్రస్తావించాలి.. కానీ, విద్యార్థులతో మాట్లాడకూడదు అంటు ఉన్నత విద్య మండలీ ఆదేశాలు జారీ చేసింది. అయిన కూడా ఈ అమ్మాయి విషయంలో చాలా అమానుషంగా వ్యవహరించారు. దీంతో అ అమ్మాయి మానవత్వం కోల్పోయింది. వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తామని చెప్పిన కూడా వారు పట్టించుకోకపోవడంతో అ విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెట్టారు.
ఇలా జరగడంతో ఆ అమ్మాయి అదృశ్యమైపోయింది. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మహతి ఫార్మసీ యాజమన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. వచ్చే సంవత్సరం నుంచి విద్యాసంస్థపై ఉన్న పర్మిషన్స్ కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.