IND VS ENG, 2nd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England ) మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో టెస్ట్ నేపథ్యంలో… ఇవాళ చివరి రోజు అంటే ఐదవ రోజు మ్యాచ్ జరగనుంది. ఇవాళ కేవలం 7 వికెట్లు తీస్తే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొడుతుంది. అలా కాదని.. ఇవాళ ఒక్కరోజు 536 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చివరి రోజు అయిన ఇవాళ…. మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు… ఇంగ్లాండ్ కు సంబంధించిన వాతావరణ శాఖ.. కీలక ప్రకటన చేసింది. ఒకవేళ వర్షం పడితే టీమ్ ఇండియాకు పెద్ద బొక్కే అని.. క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
60 శాతం వర్షం పడే ప్రమాదం
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ తో (Team India vs England ) జరుగుతున్న రెండో టెస్ట్ ఐదవ రోజు మ్యాచ్ కు… వరుణుడు విలన్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ జరుగుతున్న రెండో టెస్టు లో టీమిండియా గెలుపు ముంగిట ఉన్న సంగతి తెలిసిందే. అయితే గెలుపు సమయంలో.. టీమిండియాను వరుణుడు వణికిస్తున్నాడు. చివరి రోజు మ్యాచ్ జరిగే ఎడ్జ్ బస్టన్ లో దాదాపు 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా మార్నింగ్ సెషన్ లో వాన కచ్చితంగా పడవచ్చని చెబుతున్నారు. ఒకవేళ వర్షం ( Rain) అలాగే కొనసాగితే మ్యాచ్ డ్రా అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే నిన్న గిల్ ( Shubhman Gill) చాలా ఆలస్యంగా డిక్లేర్ చేయడంతో.. టీమిండియా కు కొత్త టెన్షన్ వచ్చి పడిందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. నిజంగానే వర్షం పడి మ్యాచ్ డ్రా అయితే… టీమిడియా కెప్టెన్ గిల్ విలన్ అవుతాడని కూడా అంటున్నారు. ఇక టీమిండియా విజయానికి 7 వికెట్లు అవసరం ఉంది.
ఇది ఇలా ఉండ గా… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 427 పరుగులు చేసింది. అటు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది ఇంగ్లాండ్. చివరి రోజున 536 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.