Tattoo Precautions| ఒకప్పుడు టాటూ అంటే కేవలం స్టైల్ కోసం వేయించుకునే వారు. కానీ ఇప్పుడు టాటూ అంటే ఒక కథ. దానకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. టూటూ ఒక లోతైన అర్థాన్ని వ్యక్తీకరించే మార్గం. భారతదేశంలో.. ముఖ్యంగా నగరాల్లోని యువతలో టాటూ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. టాటూ స్టూడియోలలో మొదటిసారి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వారు ఉత్సాహంతో వస్తున్నా.. కొంత ఆందోళన చెందుతున్నారు. ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలీ దీని గురించి వివరిస్తూ.. “మేము గత కొన్ని సంవత్సరాలలో చాలా మంది మొదటిసారి టాటూ తీసుకునే వారిని స్వాగతించాము. వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని, టాటూ ప్రపంచంలోకి మొదటి అడుగు వేసేందుకు సహాయం చేశాము. ఈ అనుభవాల ఆధారంగా.. మొదటిసారి టాటూ తీసుకునే వారికి ఉపయోగపడే సాధారణ సూచనల గైడ్‌ను సిద్ధం చేశాము.”
మొదటిసారి టాటూ తీసుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఈ సూచనలు మీ టూటూ అనుభవాన్ని సురక్షితంగా, ఆనందదాయకంగా చేస్తాయి.
నొప్పి ఉంటుంది, అందుకే ఈ జాగ్రత్తలతో
“టాటూ వేయించుకుంటే నొప్పి ఉంటుందా?” అని అందరూ అడుగుతారు. నొప్పి మీ శరీర సహన శక్తిపై, టాటూ ఎక్కడ వేయించుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. చేతులు, భుజాల వంటి కండరాలు లేదా కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నొప్పి తక్కువగా ఉంటుంది. కానీ పక్కటెముకలు, చీలమండల వంటి ఎముకలు ఎక్కువగా ఉన్న చోట నొప్పి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. లోతైన శ్వాస, తగినంత నీరు తాగడం, మంచి నిద్ర తీసుకుని రావడం వంటివి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి
టాటూ స్టూడియో ఎంచుకునేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆసుపత్రిలో లాగా పరిశుభ్రత ఉన్న స్టూడియోను ఎంచుకోండి. అక్కడ సామగ్రి శుభ్రంగా ఉండాలి. కొత్త గ్లోవ్స్, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సూదులు వాడాలి. పరిశుభ్రతలో రాజీ పడితే ఇన్ఫెక్షన్లు, గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు.
డిజైన్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి
టాటూ డిజైన్‌పై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఈ డిజైన్ ఎందుకు మీకు ముఖ్యమో ఆలోచించండి. ఆర్టిస్ట్‌తో సంప్రదించి, డిజైన్ డిజిటల్ మాకప్ చూడండి. ఇది తర్వాత పశ్చాత్తాపం రాకుండా చేస్తుంది.
ఆఫ్టర్‌కేర్ చాలా ముఖ్యం
టాటూ వేయించిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. టాటూను సున్నితంగా శుభ్రం చేయాలి. హీలింగ్ ఆయింట్‌మెంట్ రాయాలి, ఎండకు గురికాకుండా చూసుకోవాలి, గోకడం వంటివి చేయకుడదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజైన్ చెడిపోవచ్చు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. సాధారణంగా, టాటూ 2-3 వారాల్లో నయమవుతుంది.
ఆందోళన సహజమే కానీ..
మొదటిసారి టాటూ తీసుకునే వారికి భయం, ఆందోళన ఉండటం సహజం. కానీ మంచి స్టూడియో, అనుభవజ్ఞుడైన ఆర్టిస్ట్ మీకు ప్రతి దశలో సహాయం చేస్తారు, ధైర్యంగా ఉండేలా చేస్తారు.
Also Read: వృద్ధాప్యంలోనూ ఆరోగ్యమైన గుండె.. వైద్యులు చెప్పే సూచనలు ఇవే..
సమాచారం సేకరించండి
టాటూ వేయించుకునే ముందు పూర్తి సమాచారం సేకరించండి. డిజైన్, స్టూడియో, ఆర్టిస్ట్ గురించి పరిశోధన చేయండి. వారి మునుపటి పనులు, క్లయింట్ సమీక్షలు చూడండి. మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.