BigTV English

Harsha Kumar : జగన్‌ను గద్దె దింపేందుకు దళితులు సిద్ధం.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దు..

Harsha Kumar : తెలంగాణకు చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు ఇవ్వకూడదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి గద్దె దింపాడానికి దళితులంతా సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. రాజమహేద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న రాజమహేద్రవరంలో దళిత సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

Harsha Kumar : జగన్‌ను గద్దె దింపేందుకు దళితులు సిద్ధం.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దు..

Harsha Kumar : తెలంగాణకు చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వకూడదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దింపడానికి దళితులంతా సిద్దంగా ఉన్నారని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 8న రాజమహేద్రవరంలో దళిత సింహగర్జన సభను నిర్వహిస్తామని ప్రకటించారు.


వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు అధికంగా జరిగాయని హర్షకుమార్ ఆరోపించారు. దళితులు నిరాదరణకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి దళితులపై అనేకసార్లు దాడులు జరిగాయన్నారు. బాధితులకు న్యాయం కూడా దక్కడం లేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికలలో తాను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో‌‌లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఎస్సీలను మోసం చేసిందని విమర్శించారు. వైసీసీ నేతలు ఎకరాల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉండే ముఖ్యనేతలు ఆ భూములను పంచుకుంటున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా విమర్శించారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×