Weather News: గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు భారీగా చోటుచేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పోయిన ఏడాది కంటే ఈ సారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిపింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వివరించింది.
ఈ రోజు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్ర్రాద్రి కొత్త గూడెం, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పాలమారు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వివరించారు. ఇవాళ అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే.. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయని చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టిపరిస్థుతుల్లో వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని అధికారులు వివరించారు.
ALSO READ: CISF Jobs: గోల్డెన్ ఛాన్స్.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: Kavitha: బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే కుట్ర.. అవసరమైతే జైలుకెళ్తా.. కవిత కామెంట్స్