Deepika Padukone: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న దీపికా పదుకొనే (Deepika Padukone) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. అటు గ్లామర్ పాత్రలతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు మరొకసారి సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. తనకు కూడా స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అంటే ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ. 150 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే విజయ్ (Vijay ), ప్రభాస్ (Prabhas) లాంటి వారు మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan) లాంటి వాళ్ళు ఇంకా రూ.100 కోట్ల లోపే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం.
ఇప్పుడు ప్రభాస్ రేంజ్ లోనే తనకు కూడా పారితోషకం కావాలి అని డిమాండ్ చేస్తోంది దీపికా పదుకొనే.
హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న దీపిక..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ స్పిరిట్ ‘ సినిమాలో మొదట దీపికా పదుకొనేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె రూ.20 కోట్లు డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తంలో ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వలేక సినిమా నుండి ఆమెను తప్పించి, రంగంలోకి ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri)ని దింపారు. ఈమెకు కేవలం రూ.4కోట్ల పారితోషకం మాత్రమే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు రూ.20 కోట్లకే ఈమెను సినిమా నుండి తప్పించారు అంటే.. ఈమె హీరోల రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేస్తుంటే అసలు ఈమెకు మరి అవకాశాలు వస్తాయా అనే రేంజ్ లో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు దీపిక తన అభిప్రాయంగా ఎలాంటి కామెంట్స్ చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తే తప్పేంటి – దీపిక
ఇకపోతే దీపిక పదుకొనే మాట్లాడుతూ..” నాకు ఇటీవల ఒక సినిమాలో అవకాశం వచ్చింది. స్టోరీ విన్నాను. ఓకే ఇక పారితోషకం విషయానికి వస్తే చాలా తక్కువ ఆఫర్ చేశారు. నాకు తెలుసు నా క్రెడిబులిటీ ఏంటో. ట్రాక్ రికార్డు తెలుసు.. అలాంటిది నాకు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తే తప్పేంటి. ఇక వారు అంత పారితోషకం ఇవ్వలేము అని చెప్పడంతో.. వెంటనే పర్వాలేదు అని నేను సినిమా నుంచి తప్పుకున్నాను” అంటూ గతంలో దీపిక చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ట్రెండింగ్ లో #ShamelessDeepika హ్యాష్ ట్యాగ్..
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా సినిమా విషయంలో సందీప్ కి – దీపికా కి మధ్య జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని, దీపికా కు సంబంధించిన ఆ పాత వీడియోని జోడిస్తూ “#ShamelessDeepika” అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక గతంలో దీపిక పారితోషకం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సందీప్ మూవీ విషయంలో జరిగిన సందర్భాన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేస్తూ ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే దీపికాను స్పిరిట్ మూవీ నుండి తప్పించిన తర్వాత ఆమె పీ ఆర్ టీమ్ సినిమాకు సంబంధించి స్టోరీని లీక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ సందీప్ రెడ్డివంగా..” ఇదేనా మీ నిజాయితీ.. ఇదేనా మీ ఫెమినిజం.. ఒక వ్యక్తిని నమ్మి కథ పూర్తిగా చెబితే.. ఇలా మీరు లీక్ చేస్తారా..? లీక్ చేస్తే చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అంటూ దీపికాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. దీంతో గత నాలుగు ఐదు రోజులుగా దీపికా పేరు బాగా వినిపిస్తోంది.
ALSO READ : Sukumar: శ్రేష్టీవర్మపై సుకుమార్ ఊహించని కామెంట్స్.. అప్పుడు అండగా నిలవలేకపోయాం అంటూ..!
Shameless @deepikapadukone thinks she deserves ₹100-₹150CR fees, just like a male superstar… when she can barely pull 2-3cr opening on Day 1 in theatres. The audacity 🤡! #ShamelessDeepika#Spirit | #Prabhas | #SandeepReddyVanga pic.twitter.com/YhIfMKhbHw
— BFilmy Official (@_BFilmyOfficial) May 29, 2025