BigTV English

Budameru effect: మరోసారి బుడమేరు డేంజర్ బెల్స్ మోగిస్తోంది

Budameru effect: మరోసారి బుడమేరు డేంజర్ బెల్స్ మోగిస్తోంది
Advertisement

Due to the cyclone effect heavy rains in Vijayawada..budameru flood water increase: విజయవాడ నగరాన్ని చరిత్రలో ఎన్నడూ లేనంతగా భయపెట్టిన బుడమేరు వరద తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. అసలు ఎంత నష్టం జరిగిందో అంచనాలకు కూడా అందడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోజుకు పది లక్షలకు పైగా నిరాశ్రయులకు ఆహార పొట్లాలు, నిత్యావసరాలు అందిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా ఇంకా త్గగ్గని వరద. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం తగ్గుతోంది. కానీ బురద మాత్రం దారుణంగానే ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చివేసే పనులలో అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.


గండ్లుపూడ్చే పనిలో..

ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు హెచ్చరికలతో.. ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడ గండ్లు పూడ్చివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అంతా బాగానే ఉంది. హమ్మయ్య అనుకునే సమయానికి బంగాళా ఖాతంలో మరో వాయుగుండం పడింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో మళ్లీ ఎడతెరిపిలేని వానలు కురుస్తుండటంతో ప్రజలు ఏ క్షణాన ఏమవుతుందో అని ఆందోళన పడుతున్నారు మంగళ, బుధవారాలలో ఎగువ ప్రాంతమైన ఖమ్మం, మైలవరం ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మళ్లీ బుడమేరు నీటి ప్రవాహం పెరిగింది. బుడమేరుకు కొండపల్లి శాంతినగర్ వద్ద మూడు గండ్లు పడ్డాయి. దీనితో మరోసారి సింగ్ నగర్, రాయనపాడు, కవులూరు, తలప్రోలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే గత అర్థరాత్రి కురిసిన వర్షాలకు ఈ సారి పంట పొలాలనూ బుడమేరు ముంచెత్తింది.


భయపెడుతున్న సామాజిక మాధ్యమాలు

ఇదిలా ఉండగా విజయవాడ నగర వాసులను భయపెట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పాత వీడియోలను షేర్ చేస్తున్నారు కొందరు. మరోసారి బుడమేరు విరుచుకుపడనుందని..ఫలానా ప్రాంతాలకు భారీగా వరద వస్తోందంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇప్పటికీ తాడేపల్లి, వెలగలేరు, నున్న వంటి గ్రామాలన్నీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇవేగాక కవులూరు, జక్కంపూడి కాలనీ, నైనవరం, పైడూరు పాడు లో పలు కాలనీలన్నీ పూర్తిగా జలదిగబంధంలోనే ఉన్నాయి. అధికార యంత్రాంగం ట్రాక్టర్ల సాయంతో సరుకులను మారుమూల ప్రాంతాల వదర బాధితులకు అందిస్తున్నారు. మంగళగిరిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు లక్షల సంఖ్యలో ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందిస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ హీరోలు స్పందించి కోట్లలో సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

మరోసారి రెడ్ ఎలర్ట్

బుడమేరు వెడల్పు 180 మీటర్లు ఉంటే..ఆక్రమణలతో సగానికి పైగా తగ్గిపోయింది. అందుకే తెలంగాణలో చెరువులు ఆక్రమించినవారిపై ప్రయోగించిన హైడ్రా ను ఆంధ్రాలో కూడా ప్రయోగించాలని కోరుతున్నారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా పరివాహక ప్రదేశాలలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆ ప్రాంతాలలో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. ఇటీవలే కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని జూన్, జులై నెలలో వరి పంటలు వేశామని , ఎంతో వ్యవప్రయాసలకోర్చి విత్తనాలు, ఎరువులు, రసాయన పురుగుల మందులు కొన్నామని..అందిన కాడికి అప్పులు చేసి పంట వేశామంటున్నారు అక్కడి స్థానిక రైతులు. తీరా చూస్తే పంట ప్రాధమిక దశలోనే బుడమేరు వరదకు పూర్తిగా నీట మునిగిందని..రైతులు వాపోతున్నారు. ఇప్పుడు మరోసారి బుడమేరు వరద వస్తే ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు ప్రజలు.ఇదిలా ఉండగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా తట్టుకుంటామని అధికార యంత్రాంగం చెబుతోంది.

Related News

CM Chandrababu Visit UAE: టార్గెట్ ఏపీకి పెట్టుబడులు.. దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

Kandukuru Case: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం

Nara Lokesh: ఏపీ – తమిళనాడు – కర్నాటక.. ట్రయాంగిల్ ఫైట్ లో మోదీని మెప్పించిన లోకేష్

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు

Big Stories

×