APPin

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

high temperatures in ap

AP : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఏపీలో గత 4 రోజులగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలపై సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది.

సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 8 నాటికి నైరుతి రుతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఆదివారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. పని ప్రదేశాలు, ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Related posts

Jagan: కొడాలి, అనిల్.. సజ్జల, బుగ్గన.. ఎవరైతే నాకేంటి?

BigTv Desk

Bridge : ఇచ్ఛాపురంలో కుప్పకూలిన వంతెన.. ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Bigtv Digital

Corona: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Bigtv Digital

Leave a Comment