BigTV English
Advertisement

Hindupuram Municipality Politics: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు

Hindupuram Municipality Politics: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా  మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు

Hindupuram Municipality Politics| ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత వేరే పార్టీ గెలవలేదు.. అలాంటి చోట అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ హిందూపురం మున్సిపాల్టీని కైవసం చేసుకుంది .. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గెలిచారన్నది ఓపెన్ సీక్రేట్టే … అయితే ఓటమి తర్వాత ఆ మున్సిపాల్టీలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నారు .. వారిని నియంత్రించడానికి వైసీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారంట… ఆ క్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి అటు జగన్, ఇటు బాలక‌ృష్ణకి ప్రతిష్టాత్మకంగా మారిందన్న ప్రచారం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.


హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు … 2019 ఎన్నికల్లో వైసీపీ హవా వీచినప్పుడు సైతం అక్కడ బాలయ్య మెజార్టీ పెరిగింది .. అసలు టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో మరే ఇతర పార్టీ గెలిచిన చరిత్రే లేదు … అలాంటి చోట 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింద .. 38 మంది కౌన్సిలర్లకు గానూ వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులనే గెలుచుకుంది. .. ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ హవా అలా సాగిపోయింది.

Also Read: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!


అయితే వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిపోవడంతో.. స్థానిక సంస్థలలో ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు అంతా అధికార కూటమిలో చేరుతున్నారు. . హిందూపురం చైర్ పర్సన్ ఇంద్రజ సైతం టీడీపీ గూటికి చేరారు …. ఆమె తనతో సహా 11 మంది కౌన్సిలర్లతో టీడీపీలోకి వచ్చారు. ఆమె తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా కూడా చేశారు …. టీడీపీ నుంచి కూడా ఆమెనే చైర్ పర్సన్ చేస్తారు అన్న ప్రచారం ఉంది … అక్కడ 20 మంది కౌన్సిలర్ల బలం ఉన్న పార్టీకి చైర్‌పర్సన్ పదవి దక్కుతుంది .

ఆల్రెడీ టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా … ఇపుడు వైసీపీ నుంచి 11 మంది వచ్చి చేరడంతో టీడీపీ బలం 17కి పెరిగింది. ఇక హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి టీడీపీకే చైర్ పర్సన్ పదవి దక్కుతుందని లెక్కలేసుకున్నారు.. అయితే ఈ విషయంలో వైసీపీ కూడా సీరియస్‌గా ఉందంట.. ఆ క్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీడీపీ కూటమిలోకి వెళ్ళిన 11 మందిలో నలుగురిని వెనక్కి తీసుకొచ్చార .. వారికి జగన్ కౌన్స్లింగ్ ఇచ్చి మరీ క్యాంపుకు తరలింప చేశారంట.

దాంతో ఇపుడు హిందూపురం కౌన్సిల్లో కూటమి బలం తగ్గిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ మంది ఉండడంతో బాలయ్య రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు…. ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ ని దక్కించుకోవడం బాలయ్యకు సవాల్‌గా మారిందంటున్నారు.. అందుకే ఆయన మాన్సిపాల్టీపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారంట…. అటు వైసీపీ కూడా సీరియస్ గా తీసుకోవడంతో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది … అల్రెడీ చైర్‌పర్సన్ రిజైన్ చేయడంతో.. మరి ఎన్నికల్లో ఆ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో చూడాలి.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×