YSRCP Bheemili: స్థానిక సంస్థల ప్రచారం పతాక స్థాయికి చేరి, ప్రతి నిమిషం విలువైన కీలకమైన సమయంలో తీరప్రాంతాన్ని ఆర్నబ్ తుపాను ముంచెత్తింది. విశాఖ తీరం, ముఖ్యంగా భీమిలి తీరప్రాంత మత్స్య కార గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు తుపాను ప్రభావంతో అతలాకుతలమయ్యే ప్రమాదం ఏర్పడింది. చాలామంది నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వదిలి బయటకు రావడానికి ఇష్టపడని తరుణంలో.. డాక్టర్ బొత్స అనూష తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేసింది. బొండపల్లిలో ప్రచారం ఒకవైపు చేస్తూనే, మరోవైపు భీమిలి నియోజకవర్గానికి పరుగుతీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్య కార కాలనీలు, లోతట్టు గ్రామాలను స్వయంగా సందర్శించి ప్రజల యోగక్షేమాలను తెలుసుకున్నారు.
తుపాను భయంతో ఉన్న ప్రజలకు ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా ఒక కుటుంబ సభ్యురాలిగా బొత్స అనూష అండగా నిలిచారు. ఏ కష్టమొచ్చినా మీకు నేనున్నాను మన పార్టీ మీకు తోడుగా ఉంటుంది. ఎవరూ అధైర్య పడవద్దుంటూ భరోసా ఇచ్చారు. తీరప్రాంతంలో మత్స్య కారుల బోట్లు, వలలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సహాయక చర్యలను సమన్వయం చేశారు. ఆహారం, మంచినీరు, అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా స్థానిక పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. ఎన్నికల వేళ రాజకీయ మైలేజీ కోసం కాకుండా.. ఆపదలో ఉన్న ప్రజలకు నేరుగా బాసటగా నిలవడం క్షేత్రస్థాయి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
Also read: పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే
ఈ పరిణామం డాక్టర్ బొత్స అనూష రాజకీయ ఎదుగుదలలో ఒక అత్యంత కీలకమైన మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో బాధ్యతలు మారినప్పుడు లేదా కొత్త టాస్కులు వచ్చినప్పుడు గందరగోళానికి గురికాకుండా.. రెండు భిన్నమైన క్షేత్రాల్లో సమాంతరంగా బాధ్యతలను నిర్వర్తించడం సాధారణ విషయం కాదు. ఒకవైపు గెలుపే లక్ష్యంగా బొండపల్లిలో పార్టీ జెండాను మోస్తూ ఎన్నికల యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.. మరోవైపు తనకు కేటాయించిన భీమిలి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణమే స్పందించి అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఇది నాయకత్వంలో ఉండాల్సిన పరిపక్వతకు, ప్రజల పట్ల ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నియామకం జరిగిన రోజున విమర్శలు ఎదురైనప్పటికీ.. చేతల్లో సమర్థతను చూపించి ప్రత్యర్థులను ఆలోచనలో పడేసే సరికొత్త రాజకీయ నాయకత్వ శైలిని డాక్టర్ బొత్స అనూష ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల క్షేత్రమైన బొండపల్లిలో ఓటర్లు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోంది? భీమిలి ప్రజల గుండెల్లో సంక్షోభ వేళ ఆమె సంపాదించుకున్న స్థానం భవిష్యత్తు రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? పదవుల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఈ ప్రస్థానం ఏ స్థాయికి చేరుతుందో తెలియాలంటే రాబోయే కాలమే నిర్ణయించాలి!
Also Read: రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?