Home Minister Anitha : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో హోం మంత్రి అనిత పర్యటిస్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ కు ముందు ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత.. వాహనం దిగి క్షతగాత్రులకు సహాయం చేశారు. తన సిబ్బంది ద్వారా బాధితులకు సర్వత సాయం చేశారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ లోని పాత గాజావాక జంక్షన్ మీదుగా వెళుతుండగా.. అక్కడ ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న వారిని ఓ ట్రావెల్స బస్సు ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న మంత్రి.. తన కాన్యాయ్ ను అపించారు. బాధితులకు తక్షణ సహాయం చేయాలని తన సిబ్బందికి సూచించారు. దాంతో బాధితులకు సాయంగా నిలిచారు.