Sandeep Kishan..సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి కూడా వెనుకాడరు. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేక వయసుకు తగ్గ హీరోల పక్కన హీరోయిన్లు గానో నటిస్తారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున(Nagarjuna )హీరోగా నటించిన మన్మధుడు(Manmadhudu) సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపించి, అందరిని ఆకట్టుకున్న యువతి అన్షు అంబానీ (Anshu ambani).. ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాఘవేంద్ర (Raghavendra) సినిమాలో కూడా నటించింది.’ మిస్సమ్మ’ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించిన ఈమె, ఒక తమిళ సినిమా కూడా చేసి, ఇక శాశ్వతంగా సినిమాలకు దూరమయింది ఈ ముద్దుగుమ్మ.
రీ యంట్రీ ఇస్తున్న అన్షు అంబానీ..
ఇండస్ట్రీకి దూరమైంది. అలాగే పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లో కూడా అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అన్షు రీయంట్రీ ఇస్తోంది. ఇటీవల తెలుగులో పలు టీవీ షోలో కూడా కనిపించి, పలు ఇంటర్వ్యూలు కూడా చేసిన ఈమె 22 ఏళ్ల తర్వాత తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ లుక్స్ లో కాస్త తేడా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అన్షు సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా నటిస్తున్న ‘మజాకా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
అన్షు అంబానీ ఫస్ట్ లుక్ పోస్టర్..
ఆ పోస్టర్లో అన్షు పెళ్లికూతురు గెటప్ లో చేతిలో తాళి, మరో చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని ఉంది. ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతూ ఉండగా.. ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెప్పుడో నాగార్జున పక్కన చేసిన ఈమె.. మళ్లీ ఇప్పుడు సందీప్ పక్కన హీరోయిన్గా చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఒకరకంగా చెప్పాలి అంటే సందీప్ కంటే కూడా ఈమె ఏజ్ లో కాస్త పెద్దదే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రావు రమేష్ (Rao Ramesh) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె సందీప్ కిషన్ పక్కన హీరోయిన్ గా నటిస్తోందా? లేక రావు రమేష్ పక్కన హీరోయిన్గా నటిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు రీ ఎంట్రీలో ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మరో హీరోయిన్గా రీతూ వర్మ (Reethu Varma) కూడా నటిస్తోంది. ఆమె పోస్టర్ని కూడా ఇటీవల రిలీజ్ చేయగా.. ఆమె కూడా పెళ్లికూతురు గెటప్ లో కనిపించింది. మొత్తానికైతే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ల అనిపిస్తోంది.