E-Paper
Advertisement

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ కలకలం.. రంగంలోకి హోంమంత్రి అనిత

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ కలకలం.. రంగంలోకి హోంమంత్రి అనిత
Advertisement

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైలు భద్రత, కదలికలపై వస్తున్న ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లోని బ్యారెక్స్ ఫై జైలు సూపరిండెంట్ మహేష్ బాబు తనిఖీలు చేపట్టారు. జైల్లోని అన్ని బ్లాక్ లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి తనిఖీలు చేయడంతో మూడు సెల్ ఫోన్లు, ఒక్క సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం విశాఖ మాజీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కుమార్ డైరెక్ట్ లో దొరికిన రెండు సెల్ ఫోన్లు, బ్యాటరీ, రెండు డేటా కేబుళ్ళు. నిన్న నర్మదా బ్లాక్ లో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

నర్మదా బ్లాక్ లోని గదిలో ఫ్లోర్ ని తవ్వేసి మార్బుల్ అమర్చినట్లు సూపరిండెంట్ గుర్తించారు. నర్మదా బ్లాక్ లో ఉంటున్న గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీపై అనుమానాలు ఉన్నాయన్నారు జైలు అధికారి. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న లోపలికి వెళ్తున్న సెల్ ఫోన్లపై అనుమానం వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది సెల్ ఫోన్ లను లోపలికి తీసుకువెళ్లి ఖైదీలకు ఇస్తున్నారనే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీలకు సహకరిస్తున్నారనే అనుమానంతో వార్డర్ ల దుస్తులు విప్పి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. జైలు ముందు జైలు సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో 37 మందిని జైలు అధికారులు బదిలీ చేశారు. జైలులో ఇంకా తనిఖీలు చేస్తామని సూపరిండెంట్ మహేష్ బాబు తెలిపారు.

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ మధ్య విశాఖ సెంట్రల్ జైలు చుట్టూ వరుస వివాదాలు నెలకొన్నాయి. దీంతో నేరుగా తానే రంగంలోకి దిగారు అనిత. వరుస తనిఖీల్లో ఖైదీల వద్ద సెల్‌ఫోన్స్‌ దొరకడం.. వారం క్రితం జైలు సిబ్బంది కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడం.. ఉన్నతాధికారులు వేధించారని ఆరోపణలు రావడం.. ఇలా అనేక ఘటనలు జరగడంతో నేరుగా హోంమంత్రి రంగంలోకి దిగారు.

Also Read: బయటపడ్డ భూమన గ్యాంగ్.. దందా లెక్కలు

Advertisement

ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డీజీ విచారణ జరిపారు. తప్పు ఎవరిదన్న కోణంలో ఆయన విచారణ జరిగింది. ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత విశాఖ సెంట్రల్ జైలులో 37 మంది వార్డర్లపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. మరోవైపు జైలు బ్యారెక్స్‌లో మూడు సెల్ ఫోన్లు, ఒక సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్ దొరికాయి. దీంతో మరోసారి విశాఖ సెంట్రల్‌ జైలు వివాదంలో చిక్కుకున్నట్టైంది.

ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ..  విశాఖ సెంట్రల్ జైల్‌లో గంజాయి మొక్క తాను చూశానంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లోని ప్రతి బ్యారెక్‌ను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము పట్టించుకుంటున్నామన్నారు. జైల్లో సెల్ ఫోన్ దొరకడం షాకింగ్ గా ఉందన్నారు. గాంజా కూడా సప్లై చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇదంతా ఎలా జరుగుతోందో ఎంక్వైరీ చేస్తున్నామని.. ఇందులో ఎవరున్నా.. వదిలేది లేదని హోంమంత్రి హెచ్చరించారు.

 

Related News

రేణిగుంట రైల్వే స్టేషన్.. ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా, ఆత్మహత్య చేసుకుంటానంటూ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×