Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఐదు మ్యాచ్ ల ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. గత నాలుగు సార్లుగా ఆస్ట్రేలియా పై ఈ సిరీస్ టైటిల్ గెలుస్తూ వచ్చిన టీమిండియా ఈసారి మాత్రం చతికిలబడింది.
Also Read: Australia Won BGT: WTC రేసు నుంచి ఔట్..10 ఏళ్ల తర్వాత BGT సిరీస్ కోల్పోయిన టీమిండియా
ఈ చివరి 5వ టెస్ట్ లో భారత్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 27 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ని ఖరారు చేసుకుంది. ఇక ఈ ఐదవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆస్ట్రేలియా అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు. గ్రౌండ్ లో కోహ్లీ ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే.
భారత జట్టుని లేదా అతడిని ఎవరైనా టార్గెట్ చేస్తే గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తాడు. అయితే ఈ ఐదవ టెస్ట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రా లేకపోవడంతో భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్న కోహ్లీ.. మూడవ రోజు జరుగుతున్న ఆటలో భాగంగా సరదాగా ప్రేక్షకులను అలరించాడు. కోహ్లీ తో పాటు భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ ఆసీస్ అభిమానులు రెచ్చిపోవడంతో విరాట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అంతకుముందు అతడి షూస్ లో సాండ్ పేపర్ ఉందంటూ పలు వీడియోలను ఆస్ట్రేలియా అభిమానులు షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ ఔట్ అయిన తర్వాత తన రెండు జేబులను చూపిస్తూ నా దగ్గర ఏమీ లేదు.. నా జేబు ఖాళీ అన్నట్లుగా ప్రేక్షకుల వైపు చూసి సైగలు చేశాడు. అయితే స్మిత్ సాండ్ పేపర్ స్కామ్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 2018 మార్చ్ లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్ బ్యాటర్ బాన్ క్రాఫ్ట్ ఓ సాండ్ పేపర్ ముక్కను జేబులో పెట్టుకొని వచ్చాడు.
Also Read: Travis Head: ఒరేయ్ ఏంట్రా.. SRH హెడ్ ను లేడీ చేసేశారు ?
ఆ పేపర్ సాయంతో మైదానంలో గేమ్ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో బాన్ క్రాఫ్ట్ కి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మద్దతు పలికారు. ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం కెమెరాలో రికార్డు కావడంతో వీరి బాగోతం బయటపడింది. ఆ మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన తప్పును అంగీకరించాడు బాన్ క్రాఫ్ట్. అయితే ఈ వ్యవహారాన్ని ఇమిటేడ్ చేస్తూ ఆస్ట్రేలియా అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా ప్లేయర్లు గుక్కపెట్టి ఏడుస్తున్నారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు భారత అభిమానులు.
VIRAT KOHLI REPLICATING THE SANDPAPER GATE INCIDENT. 🤣🔥pic.twitter.com/qRxgmBaqAh
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025