E-Paper
Advertisement

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన
Advertisement

Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోలెరో-ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భైర్లుటి ప్రాంతంలోని నల్లమల ఘాటు రోడ్డులో బొలెరో-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ఆర్టీసీ-బొలెరో ఢీ, స్పాట్‌లో ఇద్దరు మృతి

Advertisement

కర్నూలు నుంచి కాకినాడకు హైటెక్ ఆర్టీసీ బస్సు వెళ్తోంది. దోర్నాల నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న బొలెరో వాహనం.. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టింది. ఘటన గురించి తెలియగానే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

Advertisement

ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే క్రేన్ రప్పించిన పోలీసులు, దాని సాయంతో రెండు వాహనాలను వేరు చేశారు. చివరకు బస్సును పక్కకు తొలగించారు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆర్టీసీ డ్రైవర్‌ని విచారిస్తున్నారు.

 

 

Related News

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

అల్లూరి జిల్లాలో ఘోరం.. 5 నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసిన కన్నతండ్రి!

జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

Big Stories

Advertisement
×