Dating Apps : అమరావతి ప్రాంతంలో వేశ్యలు.. ఈ టాపిక్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఆ మాట అన్న వారిని జైల్లో వేశారు. రాజకీయం ఎలా ఉన్నా.. ఏపీ మాత్రం జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్‌లో ఉందనేది నిజం. రాష్ట్రంలో ఒక లక్షా 20 వేల మంది వేశ్యలు ఉన్నట్టు PMPSE సర్వే స్పష్టం చేసింది. ఇదేమీ అల్లాటప్పా సర్వే కాదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జాతీయ సంస్థ. ఏపీనే కాదు తెలంగాణ సైతం టాప్ 5 లో ఉంది. ఇక్కడ 75 వేల మంది వ్యభి*చారులు ఉన్నారట. తెలంగాణలో ఆ హాట్ స్పాట్‌లు ఎక్కువట. సగటున ఒక్కో హాట్ స్పాట్‌లో 38 మంది మహిళలు వ్యభి*చారం చేస్తున్నారట. ఈ సంఖ్య దేశంలోనే టాప్. ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా ఎందుకు పెరుగుతోంది? అసలు ఎక్కడ జరుగుతోంది? ఎలా జరుగుతోంది?
ఆన్‌లైన్ వ్యభి*చారం..
ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ యవ్వారం జోరుగా సాగేది. ఏపీలో పెద్దాపురం, చిలకలూరిపేట అందుకు ఫేమస్. ఇదంతా గతం. ఇప్పుడు ఆ దందా దాదాపు లేదు. ఉన్నా తక్కువ సంఖ్యలోనే. హైవేల పక్కన నిలబడి పొట్ట కూటి కోసం పడుపు వృత్తి చేసే వాళ్లు ఎక్కువే. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల సమీపంలోనూ ఇలాంటి కేసులు కనిపిస్తాయి. లాడ్జీల్లోనూ ఫుల్ బిజినెస్. ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలంతో పాటు ఆ యవ్వారం కూడా అప్‌గ్రేడ్ అయింది. టెక్నాలజీని అందిపుచ్చుకుంది. మనుషులు వాళ్లే.. బిజినెస్ అదే.. కానీ ప్లాట్‌ఫామ్ మారిపోయింది. ఆన్‌లైన్ సైట్లు, డేటింగ్ యాప్స్ సెంట్రిక్‌గా వ్యభి*చారం జోరుగా నడుస్తోంది. డౌటుంటే.. లొకాంటో యాప్ ఓసారి ఓపెన్ చేసి చూడండి.. అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి. అక్కడ ఏ రేంజ్‌లో స్కాండల్ జరుగుతుందో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. లొకాంటో అనే కాదు.. రకరకాల పేర్లతో రకరకాల యాప్స్, సైట్స్ ఉన్నాయి. హోమ్ పేజ్ ఎలా ఉన్నా.. వాటి బ్యాకెండ్ బిజినెస్ ఇదే. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్‌లో యాప్స్, సైట్స్‌దే హవా.
ఎనీ ప్లేస్.. ఎనీ టైమ్..
డేటింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే.. అందమైన అమ్మాయిల ఫోటోలు ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి. అంతా యంగ్ ఏజ్‌తో కసక్ మనేలా ఉంటారు. లోకల్, నాన్ లోకల్, సౌత్, నార్త్, నేషనల్, ఇంటర్నేషనల్ ఎవరు కావాలంటే వాళ్లు. ఎనీ టైం.. ఎనీ ప్లేస్.. రెడీ అంటారు. గూగుల్ లొకేషన్ ఆన్ చేస్తే.. మన ఏరియాలోనే వాళ్ల అడ్రస్ చూపిస్తుంది. ఆ లొకేషన్ చూసి మనమే నమ్మలేక పోతాం. అంతా ఫ్యామిలీస్ ఉండే ప్రాంతమే. అందులోనే కసామిసా నడిపించేస్తుంటారు. అంత పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా మారింది వ్యభి*చారం. అది చేసే విధానమూ ఖతర్నాక్‌గా ఉంటుంది.
యాప్స్‌తోనే యవ్వారం అంతా..
నలుగురు ఐదుగురు అమ్మాయిలను పోగేసి.. మా ఫ్యామిలీ అంటూ ఓ మంచి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటాడు సదరు బ్రోకర్. డేటింగ్ యాప్‌లో ఫోటోలు, ఫోన్ నెంబర్ పెడతాడు. వాటిలో ఫేక్ ఫోటోలే ఎక్కువ. ఫోటోలో ఉండేది ఒకరైతే.. రూమ్‌లో కనిపించేది మరొకరు. ఆ టైమ్‌కి ఎవరైతే ఏంటి అంటారనే వీక్‌నెస్ మీద నడిపిస్తారు ఈ దందా అంతా. యాప్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తే ఓ బ్రోకర్ లిఫ్ట్ చేస్తాడు. వివరాలన్నీ చెబుతాడు. ఫోన్లోనే రేట్ మాట్లాడుతాడు. ఆ తర్వాత ఫలానా చోటకు రమ్మని చెబుతాడు. డైరెక్ట్‌గా ఆ అపార్ట్‌మెంట్ అడ్రస్ చెప్పడు. అలా రెండు మూడు చోట్లకు తిప్పించాక.. నమ్మకం కుదిరాక.. ముందు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని.. ఆ తర్వాత అసలు గదికి తీసుకెళతాడు. గంటకు ఇంత. రోజుకు అంత. బయటకు తీసుకెళితే ఎంత? అలా గప్‌చుప్‌గా సాగిపోతుంటుంది ఆ బిజినెస్.
ఛాయిస్‌ను బట్టి బిజినెస్..
దందా మంచిగా సాగడానికి.. ఆ అమ్మాయిలను కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. వారిలో ఏపీ యువతులే ఎక్కువ మంది ఉంటారనేది చేదు నిజం. నార్త్ వాళ్లకు డిమాండ్ ఎక్కువ. అక్కడి వాళ్లను నెలకు ఇంత ఇస్తాం అంటూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన బిజినెస్ మాట్లాడుకుంటారు. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ తదితర విదేశీయులను సైతం అరేంజ్ చేస్తుంటారు బడా బ్రోకర్లు. కొందరైతే పర్సనల్‌గా వాట్సాప్ గ్రూపులు పెట్టి మరీ రెగ్యులర్ కస్టమర్లను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. కానీ, డేటింగ్ యాప్స్, సైట్స్ తోనే పెద్ద సంఖ్యలో వ్యాపారం జరుగుతుందనేది వాస్తవం.
Also Read : అమరావతిలో లక్ష మంది వేశ్యలా? అసలు నిజాలు ఇవే..
యాప్స్ వల్లే ఏపీ నెంబర్ 2 నా?
మరి, పోలీసులు ఏం చేస్తున్నారు అనే డౌట్ రావొచ్చు. అప్పుడప్పుడూ రైడ్స్ చేస్తుంటారు. తరుచూ చేతులు కలుపుతుంటారు. అదో అండర్‌స్టాండింగ్ బిజినెస్. ఆ యాప్స్‌ను క్లోజ్ చేస్తేనే ఈ బిజినెస్‌కు చెక్ పెట్టొచ్చు. కానీ అదంత ఈజీ కాదు. డార్క్ నెట్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఆ యాప్స్, సైట్స్ క్రియేట్ చేస్తుంటారు. వాటిని రన్ చేసే వాళ్లు విదేశాల్లో ఉంటారు. హాంకాంగ్, చైనా, మలేషియా.. లాంటి దేశాల్లోని అనేక ముఠాలది ఇదే పని. అక్కడెక్కడో వాడు యాప్ క్రియేట్ చేస్తే.. వాటిని వాడేసుకుని.. ఇక్కడ మన హైదరాబాద్, బెజవాడ, వరంగల్, అనంతపురం, విశాఖ లాంటి నగరాల్లో బ్రో*తల్ బిజినెస్ జోరుగా సాగిస్తున్నారు. యాప్స్‌లో ఎంటరై ఎవరికి వాళ్లే సొంతంగా కూడా ఆ పని చేసేయొచ్చు. అలాంటి వాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకే వ్యభి*చారం ఇంతలా అందుబాటులోకి వచ్చేసిందని అంటున్నారు. ఏపీలో హాట్ స్పాట్స్ లేకున్నా.. దేశంలోనే నెంబర్ 2 గా నిలిచిందంటే.. ఇలాంటి డేటింగ్ యాప్స్, సైట్సే కారణం అంటున్నారు. ఎవరికి వారే.. రం*కు వ్యాపారమే.