NMDC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎన్ఎండీసీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్/ ఐటీఐ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్ లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC), బైలడిల ఐరన్ ఓర్ మైన్ కిరండూల్ కాంప్లెక్స్, బచేలీ కాంప్లేక్స్ దంతేవాడ, దోనిమలై ఐరైన్ ఓర్ మైన్‌లో పలు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
NOTE: దరఖాస్తు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 995
నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫీల్డ్ అడెండెంట్(ట్రైనీ), మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్/ మెకానికల్)ట్రైనీ, బ్లాస్టర్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రీషియన్ గ్రూప్2(ట్రైనీ), ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్3(ట్రైనీ), హెచ్‌ఈఎం మెకానిక్/ ఆపరేటర్ గ్రూప్3(ట్రైనీ), ఎంసీఓ గ్రూప్3(ట్రైనీ), క్యూసీఏ గ్రూప్3 (ట్రైనీ), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
కాంప్లేక్స్ ల వారీగా ఖాళీలను చూసినట్టయితే..
బీఐఓఎం కిరండూల్ కాంప్లేక్స్‌లో: 389 ఖాళీలు
బీఐఓఎం బచేలీ కాంప్లేక్స్‌లో: 356 ఖాళీలు
డీఐఓఎం దోనీమలై కాంప్లేక్స్‌లో: 250 ఖాళీలు
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 14
విద్యార్హత: ఉద్యోగాన్ని సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, బీఎస్సీ పాసై ఉంటే సరిపోతుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగానికి రూ.31,850 ఫీజు ఉంటుంది. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.32,940 జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.35,040 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఓఎంఆర్, కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nmdc.co.in/
ALSO READ: Indian Army: శుభవార్త.. ఇండియన్ ఆర్మీలో టీఈఎస్ కోర్సు.. స్టైఫండే నెలకు రూ.56,100
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 995
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14