BigTV English

TFCC Secretary Sridhar : హీరోలపై శ్రీధర్ కామెంట్స్… నడిపించింది సునీలే ?

TFCC Secretary Sridhar : హీరోలపై శ్రీధర్ కామెంట్స్… నడిపించింది సునీలే ?

TFCC Secretary Sridhar : రెండు రోజుల క్రితం తెలుగు ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అప్పుడప్పుడే ఆ థియేటర్ల బంద్ వివాదం నుంచి బయటికి వస్తున్న ఇండస్ట్రీ మరోసారి వేడక్కింది. దెబ్బకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతే కాదు… చిన్న హీరోలు, పెద్ద హీరోలు కొంత మంది బయట పడకుండా స్పందించాల్సి వచ్చింది.


అంతటి ఘన కార్యం చేసింది ఎవరో కాదు… ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ పదవిలో ఉన్న శ్రీధర్.

థియేటర్స్ బంద్ వివాదంపై స్పందించడానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన ప్రెస్ మీట్ లో సెక్రటరీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద మంటలే పుట్టాయి. వాడికి 2 లక్షల మార్కెట్ కూడా ఉండదు… కానీ, వాడికి కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తారని, 2 కోట్లకు కూడా పనికి రాని వాడికి పిలిచి మరి 13 కోట్ల పారితోషికం ఇస్తారు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు శ్రీధర్.


వాడు అని ఏ హీరోను ఉద్దేశించి అన్నాడో తెలీదు కానీ, ఆ వ్యాఖ్యలు చేయించింది ఎవరు అనే చర్చ మాత్రం ఇండస్ట్రీలో గట్టిగానే జరిగింది. ఆ వ్యాఖ్యల ప్రభావం ఏసియన్ సునీల్ నారంగ్‌పై పడింది. ఇండస్ట్రీలో ఉన్న చిన్న, పెద్ద, బడా హీరోలు అందరూ సునీల్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. దీంతో దెబ్బకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశాడు.

ఇంతకీ ఆ మాటల వెనక ఉన్నదేవరు..?

ఆయన రాజీనామా పక్కన పెడితే.. శ్రీధర్ చేత ఆ మాటలు ఎవరు చెప్పించారు అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం ఏసియన్ సునీల్ నారంగ్ పేరే చెబుతున్నారు.

సునీల్ అనే చెప్పడానికి కారణాలు ఇవే..

నిజానికి శ్రీధర్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడటం చాలా తక్కువ సార్లు జరిగి ఉంటుంది. అలాంటి వ్యక్తి వాడు వీడు అంటూ అంత స్ట్రాంగ్‌గా మాట్లాడటం చూసి అందరూ షాక్ అయిపోయారు అని చెప్పాలి.

అలాగే.. శ్రీధర్ – సునీల్… వీళ్లు ఇద్దరు చాలా ఏళ్ల నుంచి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒక రకంగా… శ్రీధర్‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కు సెక్రటరీని చేసింది సునీలే అని ఓ గాసిప్ ఇప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

అలాగే, శ్రీధర్ చేతిలో ఉన్న ఆ రెండు థియేటర్లు కూడా ఏసియన్ సునీల్ నారంగే ఇప్పిచనట్టు కూడా కొంత మంది ఓపెన్ గా మాట్లాడుతారు.
అంతే కాదు… ఆ రెండు థియేటర్స్‌కు సినిమాల ఫీడ్ కూడా ఇచ్చేది సునీలే ఓపెన్ రూమర్ ఉంది.

అలాగే, సునీల్ బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా శ్రీధరే చేసుకుంటాడు. సునీల్ కు వచ్చే డబ్బులు శ్రీధర్ దగ్గరకే వెళ్తాయి. సునీల్ చెల్లించాల్సిన పేమెంట్స్ కూడా శ్రీధర్ దగ్గర నుంచే వెళ్తాయి.

ఇలా వీరి మధ్య బంధం ఎన్నో ఎళ్ల నుంచి ఉంది. అందుకే.. శ్రీధర్ మాటల వెనకాల సునీల్ ఉన్నాడు అనే ప్రచారం సాగింది. ప్రచారం మాత్రమే కాదు… చాలా మంది ఇప్పుడు అదే నమ్ముతున్నారు.

కానీ, ఈ వార్తలను అన్నింటినీ సునీల్ ఖండించాడు. శ్రీధర్ చేసిన కామెంట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×