Big Stories

Heat wave Alert: ఈసారి వానలు ఎక్కువే, ఈ రెండురోజుల మాటేంటి?

Heat wave Alert: భారత వాతారణ శాఖ-ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాల సీజన్‌లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాత నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. యాభై ఏళ్లలో సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది 106 శాతం అంటే దాదాపు 92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.

- Advertisement -

ప్రస్తుతం ఎన్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయని, నైరుతి ప్రారంభం నాటికి వాటి ప్రభావం మరింత తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. సాధారణ వర్షపాతానికి 29శాతం, ఎక్కువ వర్షపాతానికి 31శాతం, అధిక వర్షపాతానికి 30శాతం ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఆగష్టు- సెప్టెంబర్ మధ్యకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దశాబ్దకాలంలో ఐఎండీ సాధారణం కన్నా అధికంగా వర్షపాతం ఉంటుందని ప్రకటించడం ఇదే ఫస్ట్ టైమ్.

- Advertisement -

మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం నుంచి బుధవారం వరకు రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచన చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలకు వడ గాలుల ముప్పు పొంచి వుందని హెచ్చరించింది. ఇక సోమవారం తెలంగాణలో గరిష్టంగా 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News