Murali Nayak Killed: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళినాయక్ వీరమరణం పొందారు. మురళి స్థలం సత్యసాయి జిల్లా కల్లితండా గ్రామం. పాకిస్థాన్ -భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది. పాక్ రెండు రోజులుగా జమ్ముపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. పౌరనివాసాలు, సైనిక పోస్టులే టార్గెట్‌గా దాడులకి పాల్పడింది. ఈ దాడిని ఎదుర్కొంటూ భారతీయ జవాన్ అశువులు బాశాడు. తెలుగు జవాన్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ఇదిలా ఉంటే.. సరిహద్దుల్లో పాక్ కుట్రలు కొనసాగుతున్నాయి. భారత్‌ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. భారత్ దాడులతో బెంబేలెత్తుతున్న పాక్.. ఉగ్రమూకల్ని కశ్మీర్‌లోకి పంపించేందుకు కుట్రలు చేసింది. నిన్న రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టర్‌లోని.. ధన్‌ధర్ పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ప్లాన్ చేసింది. పాకిస్థాన్ కుట్రను పసిగట్టిన BSF.. సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన.. ఏడుగురు జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది.
మరోవైపు ఆపరేషన్ సింధూర్.. నెక్ట్స్ లెవల్‌కి చేరింది. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యలకు గట్టిగా బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. దయాది దేశాన్ని చావు దెబ్బ కొడుతోంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా కుప్పకూల్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి భారత బలగాలు. మరోవైపు… సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఇంకా కాల్పులు జరుపుతూనే ఉంది. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
పాకిస్తాన్ దాడులకు ధీటుగా బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కీలక నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండి, అట్టోక్, గుజ్రన్‌వాలా, చక్వాల్, బహ్వల్‌పూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో ఎటాక్ చేసింది. భారత్ డ్రోన్‌లు దాడులు చేశాయంటూ పాక్ ఆర్మీ డీజీ స్వయంగా ప్రకటించారు. అర్థరాత్రి నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో లాహోర్, ఇస్లామాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇతర నగరాల్లో వార్ సైరన్స్ మోగుతున్నాయి.
Also Read: జమ్మూలో చిక్కుకున్న ఏపీ స్టూడెంట్స్.. సేఫ్‌గా తీసుకురావాలని ఎంపీ అభ్యర్థన
భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేయబోయిన దాడిని… భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత వైమానిక దళం S-400 సుదర్శన్ చక్ర, వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు పాక్ దాడులను అడ్డుకున్నాయి. భారతీయ సేవలో సుదర్శన్ అని పిలువబడే S-400కు సుదర్శన్ చక్రం పేరు పెట్టారు. ఇది.. ప్రపంచంలోనే అత్యం అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణుల్లో ఒకటి. ఇండియర్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడింది. S-400 స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి ఆరు లాంచర్లు, అధునాతన రాడార్, నియంత్రణ కేంద్రంతో అమర్చబడి ఉంటాయి. భారత్ రష్యా నుంచి రెండు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. వాటిలో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. 2026 నాటికి మరో రెండు అందుబాటులోకి వస్తాయి.