AP Students In Jammu: కశ్మీర్‌లో అశాంతి సృష్టించేందుకు.. పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని ప్రపంచం మొత్తం చూసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం తారస్థాయికి చేరింది. పాక్‌కు కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ని కూడా గ్లోబ్ మొత్తం గమనిస్తోంది. 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడి చేశాక.. పాక్ వీక్ అయింది. పైగా.. ప్రపంచ దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఉగ్రవాదం విషయంలో దేశంలో ప్రభుత్వం కూడా ధృడంగా ఉంది.
వీటన్నింటికి మించి భారత ప్రజల సపోర్ట్ బలంగా ఉంది. సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు.. ఇండియా మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఉగ్రవాదుల్ని ఏరిపారేయ్యాలి.. ఉగ్రవాదాన్ని గోతి తీసి పాతెయ్యాలనే మూడ్‌లో ఉంది దేశం మొత్తం. అందువల్ల.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇంతకంటే మంచి టైమ్ లేదనే చర్చ సాగుతోంది. కొడితే.. ఇప్పుడే బలంగా కొట్టేయాలంటున్నారు. ఈసారి కొడితే.. టెర్రరిజం మళ్లీ లేవకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి.
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. దేశ వ్యాప్తంగా మొత్తం 24 ఎయిర్ పోర్టులు తమ సేవలను నిలిపివేశాయి. భారత అధికారులు విమాన ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీలు విడుదల చేశారు. మారిన షెడ్యూళ్లను చెక్ చేసుకుని ప్రయాణాలు కొనసాగించడం, వాయిదా వేసుకోడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
చంఢీగర్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, బుంటార్, కిషన్ గర్, పటియాలా, షిమ్లా ఎయిర్ పోర్టులు మూసివేశారు. వాటితో పాటు కాంగ్రా గగ్గల్, బథిండా, జైసాల్మీర్, జోధ్‌పూర్, బికనీర్, హల్వారా, పఠాన్ కోట్, జమ్ము, లేహ్, ముంద్రా, జామ్ నగర్, హిరాసర్, పోరుబందర్, కెషోడ్, కాండ్లా, భుజ్ ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.
Also Read: పాక్ పై బాంబుల వర్షం.. ఎంత మంది చనిపోయారంటే
ఇక భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. జమ్మూ కాశ్మీర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఢిల్లీలో రెసిడెంట్ కమీషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్‌కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లేఖ రాసారు. జమ్మూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులని సేఫ్ గా తీసుకురావాలని, కేంద్ర అధికారులతో సమన్వయం చేయమని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు: 011-23387089, 9871999430
9871999053, 9871990081, 9818395787
రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి.. ఏపీ భవన్ కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.