India-Pakistan war 2025: పహల్‌గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యానికి కాలు దువ్వుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శత్రువుల సామర్థ్యం ఎంతో అంచనా వేయకుండా డ్యామేజ్ చేయాలని భావించింది. అడ్డంగా బుక్కయ్యింది. ఫలితంగా పాక్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదేశ అవాక్స్ ఎయిర్ వ్యవస్థను కూల్చడం వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
పాకిస్తాన్, పాక్ అక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల తొమ్మిది స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత్ సైన్యం. తమ భూభాగంలోకి ప్రత్యర్థులు రావడాన్ని తట్టుకోలేకపోయింది పాక్. భారత్‌లోని సరిహద్దు వెంబడి ఉన్న 15 నగరాలను టార్గెట్ చేసింది. ఎలాగైనా వాటిని రాత్రివేళ ధ్వంసం చేయాలని భావించింది. పక్కాగా స్కెచ్ వేసింది.
పాక్ అస్త్రాలు, దెబ్బకు దెబ్బ
అమ్ముల పొదలోని అస్త్రాలను ఒకొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టింది దాయాది దేశం. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ సైన్యం మెరుపు వేగంతో పంజాబ్ ప్రావిన్స్‌లోకి వెళ్లి అవాక్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. దీంతో దాయాది దేశానికి చెమటలు మొదలయ్యాయి. తమదేశంలోకి వచ్చి రాడార్ వ్యవస్థను కుప్పకూల్చడాన్ని తట్టుకోలేకపోతోంది. ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
గురువారం రాత్రి దాయాది దేశానికి చెందిన మూడు యుద్ధ విమానాలను కూల్చి వేసింది భారత్ సైన్యం. ఆదేశ వైమానిక రంగానికి చెందిన F-16 , JF-17 జెట్ ఫైటర్లు, అవాక్స్ వ్యవస్థకు-AWACS చెందిన విమానం మరొకటి ఉంది. AWACS అనేది ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం ధ్వంసమైంది. దాయాది దేశానికి ఊహించని దెబ్బ. అవాక్స్ విమానం నష్టం డజను యుద్ధ విమానాల కంటే తీవ్రమైంది. ఆ తరహా విమానాలు పాకిస్తాన్ వద్ద చాలా తక్కువ ఉన్నాయి.
ALSO READ: దేశభక్తితో వ్యాపారమా? రిలయన్స్ సిగ్గు సిగ్గు, దెబ్బకు దిగొచ్చిన అంబానీ
అవాక్స్- AWACS దేనికి ప్రసిద్ధి?
AWACSను ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది గాల్లో ఎగురుతూ రాడార్ స్టేషన్ మాదిరిగా చక్కబెడుతుంది. శత్రువుల విమానాలను ఇట్టే కనిపెట్ట సామర్థ్యం దీనిసొంతం. ఈ విమానం గాలులో ఎగురుతూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లా పని చేయనుంది. యుద్ధ సమయంలో ఫైటర్ జెట్‌లతోపాటు అవాక్స్ విమానాలు ఆకాశంలో గింగురులు కొడతాయి.
జెట్ ఫైటర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంది. శత్రువుల విమానాలు ఎక్కడుందో సిగ్నల్ ఇస్తుంది. భూమి, సముద్రంపైనున్న కేంద్రాలకు సమాచారం అందవేస్తుంది. ఆధునిక వార్‌లో ఆ తరహా విమానాలు కీలక పాత్రలు పోషించనున్నాయి. ఎప్పటికప్పుడు యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేయనుంది.
ఇదొక కీలకమైన అస్త్రం
ప్రత్యర్థులు దాడికి వచ్చే డ్రోన్లు, క్షిపణులు, విమానాలను గుర్తించడంలో సహాయపడుతుంది. శత్రువు రేడియో తరంగాలను అడ్డుకోవడం, సిగ్నల్స్ జామ్ చేయడం ఇందులో కీలకమైనవి. వార్ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థను గుర్తించడంలో నిఘా వ్యవస్థలకు సహాయపడుతుంది. పాకిస్తాన్ వద్ద ఆ తరహా విమానాలు 9 ఉన్నాయని చెబుతారు.
స్వీడన్ కంపెనీ నుంచి ఆయా విమానాలను కొనుగోలు చేసినట్టు చెబుతారు. 360 డిగ్రీల కోణంలో అవాక్స్ నిఘా వేయనుంది. 5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోవున్నా, 60 వేల అడుగుల ఎత్తు వరకు నిఘా వేయడం దీని సొంతం. అవాక్స్ విమానం ధ్వంసంతో పైచేయి సాధించింది భారత్.
ప్రమాదాన్ని అడ్డుకోవడమే కాదు శత్రువుకి కోలుకోని దెబ్బ కొడతామని చెప్పకనే చెప్పింది. భూభాగంలోని ఏ వాతావరణంలోనైనా పని చేస్తుంది. ఈ తరహావి ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, నార్త్ కొరియాలు మాత్రమే ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి.