BigTV English

Single Movie Review : ‘సింగిల్’ మూవీ రివ్యూ : సాగదీతతో కూడిన సిల్లీ కామెడీ

Single Movie Review : ‘సింగిల్’ మూవీ రివ్యూ : సాగదీతతో కూడిన సిల్లీ కామెడీ

Single Movie Review : శ్రీవిష్ణు ‘సింగిల్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ నుండి వచ్చిన సినిమా కావడంతో ప్రత్యేకతని సంతరించుకుంది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ :
విజయ్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంకు ఉద్యోగి. అయితే మంచి జీతం వస్తున్నా సింగిల్ గానే ఉండిపోయాను.. అనే అసంతృప్తితో జీవిస్తూ ఉంటాడు. అతనికి అరవింద్ (వెన్నెల కిషోర్) బెస్ట్ ఫ్రెండ్. ఇలా ఉంటే.. విజయ్ ఓ రోజు ఆడి షోరూంలో సేల్స్ గర్ల్ గా పని చేస్తున్న పూర్వ (కేతిక శర్మ)ను చూసి ఇష్టపడతాడు. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కారు కొనే వంకతో వెళ్లి ఆమెతో మాటా మాటా కలుపుతాడు. ఓ రోజు విషయం పూర్వకి తెలిసిపోతుంది. దీంతో అతన్ని ఛీ కొడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో హరిణి (ఇవాన) వచ్చి విజయ్ కు ప్రపోజ్ చేస్తుంది. దీంతో విజయ్ ఆశ్చర్యపోతాడు? అసలు హరిణి.. విజయ్ లో ఏం చూసి ప్రేమించింది? విజయ్.. హరిణి ప్రేమను యాక్సెప్ట్ చేశాడా? పూర్వని మర్చిపోయాడా? తర్వాత పూర్వ ఏమైనట్టు? మధ్యలో విజయ్ స్నేహితుడు… అరవింద్ లైఫ్ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన ‘సింగిల్’ సినిమా కథ.


విశ్లేషణ :
శ్రీవిష్ణు ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినిమాలు తీసిన ప్రతిసారి సేఫ్ అవుతూ వస్తున్నాడు. కానీ ఈ మధ్య శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీ శృతి మించే విధంగా ఉంటుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ‘సామజవరగమన’ లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా సరిపోయాయి. అందుకే అది బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ జస్ట్ పాస్ మార్కులు వేయించుకుంది. కానీ ‘శ్వాగ్’ లో శృతి మించిన హాస్యం.. ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే రిజెక్ట్ చేశారు.

ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సింగిల్’… పైన చెప్పుకున్న 3 సినిమాలకి మధ్యలో ఉంటుంది. ఈసారి అయితే శ్రీవిష్ణు… కథపై కంటే కామెడీ పైనే ఎక్కువగా అదరపడ్డాడు అని ప్రతి సీన్ చెబుతుంది. సోషల్ మీడియా రిఫరెన్సులు తీసుకుని దర్శకుడు కార్తీక్ రాజు అల్లిన హాస్యం.. మొదట్లో బాగానే ఉంటుంది కానీ.. రాను రాను చిరాకు తెప్పిస్తుంది. ‘నిను వీడని నీడని నేను’ సినిమాతో దర్శకుడు కార్తీక్ రాజులో విషయం ఉంది అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత రెజీనాతో చేసిన ‘నేనేనా’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమా స్టార్టింగ్ పోర్షన్స్.. కార్తీక్ లో విషయం ఉంది అని గుర్తుచేస్తాయి. కానీ ‘సింగిల్’ కి వచ్చేసరికి అతని మార్క్ ఏమాత్రం కనిపించింది.

శ్రీవిష్ణు సినిమా అంటే ఆడియన్స్ కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి కరెక్ట్ గా ఉండాలి అనే ప్రెజర్ కార్తీక్ పై నిర్మాతలు అయిన గీతా ఆర్ట్స్ వారు ఎక్కువగా పెట్టి ఉండొచ్చు. అందుకే అతని మార్క్ కంప్లీట్ గా మిస్ అయిన సినిమా ఇది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. ఎక్కువా కాదు, తక్కువా కాదు.

నటీనటుల విషయానికి వస్తే… శ్రీవిష్ణు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఎక్స్ప్రెషన్స్ కూడా కొత్తగా పలికించింది ఏమీ లేదు. ఇలాంటి కథలు.. ఇంకో రెండు చేస్తే మనోడు కెరీర్ కూడా క్లైమాక్స్ కి వచ్చేయడం ఖాయం. వెన్నెల కిషోర్ కు మంచి రోల్ దొరికింది. ఆల్మోస్ట్ అతనికి ఇది సెకండ్ హీరో రోల్ వంటివి. దర్శకుడు కార్తీక్ రాజు మొదటి నుండి వెన్నెల కిషోర్ కి మంచి రోల్ ఇస్తాడు. ఈ సినిమాతో కూడా అదే జరిగింది. కేతిక శర్మ నటనలో ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. లుక్స్ పరంగా ఆమె మేకప్ కూడా ఓవరైన ఫీలింగ్ కలుగుతుంది. ఇవానా కూడా అంతే. ‘లవ్ టుడే’ లో కనిపించిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇందులో ఏమీ కనిపించలేదు. వీటీవీ గణేష్, ప్రభాస్ శీను, కల్పలత వంటి వాళ్ళ పాత్రలు అంతంత మాత్రమే.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ
ఫస్ట్ హాఫ్
రన్ టైం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువ అవ్వడం
సాగదీత

మొత్తంగా.. ‘సింగిల్’ సినిమా శ్రీవిష్ణు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సెలబిలిటీ కోసం తీసిన సినిమాలా ఉంది. కొన్ని కామెడీ సీన్లు మినహాయిస్తే.. ఆ సాగదీతని ఓటీటీలో మాత్రమే భరించగలం.

Single Telugu Movie Rating  : 2/5

Related News

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×