BigTV English

Pithapuram, Kakinada City Violence: పిఠాపురం, కాకినాడ సిటిలో హింస జరిగే ఛాన్స్.. భారీగా బలగాల మొహరింపు!

Pithapuram, Kakinada City Violence: పిఠాపురం, కాకినాడ సిటిలో హింస జరిగే ఛాన్స్.. భారీగా బలగాల మొహరింపు!

Pithapuram, Kakinada City Violence plan on Counting Day: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టెన్షన్? ఫలితాల వెల్లడి రోజు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు రెండు నియోజకవర్గాల్లో హింస జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఒకటైతే, మరొకటి కాకినాడ.


ఏపీలో శాసనసభతోపాటు పార్లమెంటు ఎన్నికలకు ఒకే విడత మే 13న ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో హింస రేగింది. ఎన్నికల ముగిసిన తర్వాత అభ్యర్థులపై దాడులు, ఆఫీసులు ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి గమనించిన ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించింది. అంతేకాదు పోలింగ్ తర్వాత బలగాలు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు శాంతించాయి.

తాజాగా నిఘా వర్గాల నుంచి ఎన్నికల సంఘానికి కీలక నివేదిక అందినట్టు వార్తలు వస్తున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకునే అవకాశముందన్నది దాని సారాంశం. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట ప్రాంతాల్లో ఘర్షణలు జరగవచ్చని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలపై ఈసీ కన్నేసింది. అక్కడ బలగాలను మొహరించింది.


2019 ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని నిఘా వర్గాలు గుర్తుచేశాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని తెలిపింది. దీంతో ఎన్నికల సంఘం సీఐఎస్ఎఫ్, సీఆర్పీపీఎఫ్, ఏపీఎస్పీ, లోకల్ పోలీసులను మొహరించింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

ALSO READ: సిట్ నివేదికలో కీలకాంశాలు, సాయంత్రం..

ఎన్నికల సమయంలో కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి- జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నివేదిక రావడంతో ఈసీ అలర్ట్ అయ్యింది. కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Related News

Tirumala: తిరుమ‌ల‌లో మ‌రో ఘోర అప‌చారం.. అలిపిరి మెట్ల వ‌ద్దే నాన్ వెజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

TTD Pink Diamond: శ్రీవారి పింక్ డైమండ్.. ఆర్కియాలజికల్‌ విభాగం క్లారిటీ, వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

YS Jagan: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

Big Stories

×