⦿ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన మీడియా సమావేశం
⦿ కేసుల పేరుతో నా భర్తను వేధిస్తున్నారు
⦿ అక్రమంగా తొమ్మిది కేసులు పెట్టారు
⦿ జగన్ భరోసా ఇచ్చారు
⦿ ఏపీలో అరెస్టుల పర్వంపై ఢిల్లీలో ఫిర్యాదు
⦿ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన వైసీపీ శ్రేణులు
⦿ కార్యకర్తలకు అండగా నిలబడతామన్న వైవీ సుబ్బారెడ్డి
అమరావతి, స్వేచ్ఛ: Ravikiran wife Sujana – Subba Reddy: నా భర్తకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని ఇంటూరి రవికిరణ్ భార్య సుజన అన్నారు. మంగళవారం ఇంటూరి సుజన తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిశారు. తన భర్తను కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. అనంతరం సుజన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన భర్తపై 9 కేసులు పెట్టారన్నారు. తన భర్త సోషల్‌మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్న తీరును ఆమె తెలిపారు. ఇదే విషయం గురించి మాట్లాడటానికి జగన్ ను కలవడానికొచ్చానని అన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలబడతానని జగన్ భరోసా ఇచ్చారని సుజన తెలిపారు. పోలీసులు అవలంభిస్తున్న నియంతృత్శ ధోరణిపై మండిపడ్డారు. తన భర్త అరెస్టయిన విధానం మీడియాకు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ అండగా నిలబడతాం: వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అమానవీయ సంఘటనలు, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్ సీపీ మంగళవారం ఢిల్లీలో ఫిర్యాదు చేసింది. ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై వైఎస్సార్‌సీపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బృందం కలిసి మానవహక్కుల సంఘం చైర్ పర్సన్ విజయ భారతికి ఫిర్యాదు చేసి ఫిర్యాదు లేఖను అందించింది. చంద్రబాబు సర్కార్ వచ్చీ రాగానే తమ కార్యకర్తలను వేధిస్తూ..వారిని జైళ్లకు పంపి చిత్రహింసలు చేయిస్తోందని అన్నారు. 7 మంది సోషల్ యాక్టివిస్తుల పై అక్రమ కేసులు బనాయించారన్నారు. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.
తమ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని అక్రమంగా నిర్భంధించారని..డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనిఅన్నారు. ఏపీలో బావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని..ఇకనైనా మానవ హక్కు సంఘం తమ ఫిర్యాదును పరిశీలించి ఏపీ సర్కార్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖను సమర్పించారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, బాబురావు, డా.తనూజా రాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.