Siddharth: హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సిద్దుగా తెలుగువారి గుండెల్లో ఎప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. విజయాపజయాలను పక్కనపెడితే.. ఇప్పటికీ సిద్దును తెలుగుహీరోగానే పరిగణిస్తున్నారు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కున్న సిద్దు.. ఇప్ప్పుడిప్పుడే పైకి లేస్తున్నాడు.
గతేడాది చిత్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు.. ఈ ఏడాది భారతీయుడు 2 తో వచ్చాడు. అయితే చిత్తా ఇచ్చిన విజయాన్ని ఇండియన్ 2 ఇవ్వలేకపోయింది. అయినా కూడా సిద్ధుకు మంచే జరిగింది. ఎందుకంటే .. ఈ ఏడాదే అతని లైఫ్ లోకి అందాల యువరాణి అదితిరావు హైదరీ అడుగుపెట్టింది. వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగిన విషయం తెల్సిందే. అదితి వచ్చాకా సిద్దు లైఫ్ పూర్తిగా మారిపోయింది.
Actor Noel Sean:16 రోజులకే విడాకులు.. నా జీవితం నాశనమైంది.. ఎస్తేర్ ఎలాంటిదంటే ..?
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సిద్దు మళ్లీ చాలాకాలం తరువాత లవర్ బాయ్ గా మారాడు. ఆయన నటిస్తున్న చిత్రం మిస్ యూ. ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన అషికా రంగనాథన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా మిస్ యూ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వన్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఫర్ సర్వ్.. వన్ ఫ్లాట్ వైట్ ఫర్ బ్యూటిఫుల్ లేడీ అంటూ సిద్దు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. అషికాను ఇంప్రెస్ చేయడానికి సిద్దు చాలా కష్టపడుతున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.
Mohanlal: మోహన్ లాల్ లవ్ స్టోరీ.. ఇంత విసిగిపోయారా..?
ఆమె చాలా సైలెంట్ గా ఉండడం.. అతడు ఆమె వెనుకపడి మరీ తన ప్రేమను వ్యక్తం చేయడ చూస్తుంటే ఈ సినిమా అంతా ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అన్నట్లు తెలుస్తోంది. ఇక లుక్ లో సిద్దార్థ్ ను కొట్టేవారు లేరు. ఇంకా కాలేజ్ కుర్రాడిలానే కనిపించాడు.
చివర్లో లవ్ మ్యారేజ్ మనకు సెట్ కావురా అని ఫ్రెండ్ అన్నప్పుడు సిద్దు నవ్వినా నవ్వు.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. నవంబర్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మిస్ యూ తో సిద్దార్థ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.