Lokesh Kanagaraj : మామూలుగా సినిమాటిక్ యూనివర్స్ అనేవి ఫారిన్ భాషా సినిమాల్లో చాలా ఫేమస్. అలాంటి సినిమాటిక్ యూనివర్స్‌ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల కోలీవుడ్‌లోనే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా దర్శకుడిగా తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే బాలీవుడ్ స్టార్లు సైతం తనతో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు అయిన అట్లీ.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసి తనకు గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) యాడ్ అవ్వనున్నాడు. త్వరలోనే ఒక బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఏకంగా బాలీవుడ్ స్టార్‌తో…
ఇప్పటికే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ అనే సినిమాలు వచ్చాయి. ఇంకా ఈ ఎల్‌సీయూ నుండి ఎన్ని సినిమాలు వస్తాయో, అవి ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన సినిమాటిక్ యూనివర్స్ పూర్తయ్యే సమయానికి అందరు హీరోలను ఒకే సినిమాలో చూపిస్తానని ఎప్పుడో మాటిచ్చాడు లోకేశ్ కనకరాజ్. అయితే అందులో బాలీవుడ్ స్టార్లు కూడా కలిస్తే బాగుంటుందని సౌత్ ప్రేక్షకులు ఎప్పటినుండో అనుకుంటున్నారు. వారు ఆశించనట్టుగానే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక బాలీవుడ్ స్టార్ యాడ్ అవ్వనున్నాడనే విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read: ఎఫైర్ రూమర్స్ నిజం చేసిన జాన్వీ సోదరి.. ఎక్కడ వరకు వెళ్తుందో..?
ప్యాన్ ఇండియా మూవీ…
కొన్నాళ్ల క్రితం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో నటించాలని ఉందంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan).. తన ఇష్టాన్ని బయటపెట్టారు. అప్పటినుండి నిజంగానే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాజాగా అమీర్ ఖాన్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీ ఉండబోతుందనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్ఫర్మ్ అయ్యాడు.
అస్సలు ఊహించలేదు…
ఇప్పటికే లోకేశ్ కనకరాజ్‌కు, తన సినిమాలకు సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా చాలా క్రేజ్ ఉందని బయటపడింది. అందుకే అమీర్ ఖాన్ తనతో కలిసి పనిచేయాలని ఉంది అని ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఈ యంగ్ డైరెక్టర్ స్పందించాడు. సమయం వస్తే కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చాడు. కానీ చెప్పిన కొన్ని రోజులకే ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమయినా కాకపోయినా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం లోకేశ్ చేతిలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉండగా.. అవన్నీ పూర్తయ్య అమీర్‌తో సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం పడుతుంది.