YS Sharmila: అన్నా చెల్లెళ్ల బంధం అంటే ఇదేనా? స్వంత అన్ననే మాపై దుష్ప్రచారం చేయిస్తే మేము ఎవరికి చెప్పలేక వాటిని భరించాం. స్వంత చెల్లి, తల్లి, బాబాయ్ మీద దుష్ప్రచారం చేస్తే ఒక్క మాటైనా అన్నాడా.. ఇటు అసెంబ్లీ లో నోరెత్తలేడు.. అటు మాపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిపై నోరెత్తలేడు.. అటువంటి అన్నయ్య మా జగనన్న.. ఈ మాటలన్నది ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ.
సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడ్డ వారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఓ వైపు మాజీ సీఎం జగన్ కక్షపూరిత రాజకీయమంటూ విభేదిస్తున్నారు. మరో వైపు ఈ అరెస్టులపై స్వయాన జగన్ చెల్లి షర్మిళ మాత్రం సూపర్ పోలీస్ అంటూ ఏపీ పోలీసులకు కితాబిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలపై మితిమీరి ట్రోలింగ్స్ కు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి వారి భరతం పడుతున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడంపై షర్మిళ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా షర్మిళ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనతో పాటు తన తల్లిని, బాబాయిని, చెల్లిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కి భాధ్యుడు ఒక రకంగా మాజీ సీఎం జగన్ కారణమన్నారు. తమపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ పట్ల ఏనాడైనా జగన్ నోరెత్తి మాట్లాడారా అంటూ షర్మిల ప్రశ్నించారు. తనను టార్గెట్ చేస్తూ ఎన్నో అభాండాలు, అక్రమ సంబంధాలు, నీచంగా బూతులు కూడా తిట్టారని, తాను కూడా ఒక సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితురాలిగా షర్మిళ చెప్పుకొచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాన్ సైన్యం ను వైసీపీ ఏర్పాటు చేసుకొని మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వేధించిందని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. తెర వెనుక రాజకీయాలు కాదు.. దమ్ముంటే నేరుగా తనను ఢీకొట్టాలని జగన్ కు షర్మిళ సవాల్ విసిరారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు భయపడే పరిస్థితులు తెచ్చిన విషనాగులను పోలీసులు పట్టుకోవడం అభినందనీయమని ఏపీ పోలీస్ శాఖను షర్మిళ ప్రశంసించారు. ఏ పార్టీకి చెందిన వారైనా, సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధిస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇటీవల సోషల్ మీడియా విషనాగులను పట్టుకునే చర్యలకు ఏపీ పోలీస్ శ్రీకారం చుట్టడంపై, తాను ఆ చర్యలను స్వాగతిస్తున్నానన్నారు.
అయితే షర్మిళ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏకంగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్ లక్ష్యంగా షర్మిళ కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనమని చెప్పవచ్చు.
ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఢీ కొట్టు..
అన్న వైఎస్ జగన్ కు షర్మిల సవాల్
సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది వైఎస్ జగనే
పోలీసులు తీసుకుంటున్న యాక్షన్ అభినందనీయం
కానీ విషనాగులతో పాటు అనకొండలను కూడా అరెస్టు చేయాలి: వైఎస్ షర్మిల@realyssharmila @ysjagan @YSRCParty… pic.twitter.com/ziZy0eDUxm
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024