అమరావతి మునగేలదని అంటున్నారు మంత్రి నారాయణ. కేవలం ఒక బ్రిడ్జ్ కారణంగా కొండపల్లి వాగు నీరు వెనక్కి తన్నిందని, దీంతో నీళ్లు నిలబడ్డాయన్నారు. ఆ నీటిని బయటకు పంపించేశామన్నారు. రెండు రోజులుగా ఆయన అమరావతిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అర్థరాత్రి కూడా కొండపల్లి వాగు వద్దకు వెళ్లొచ్చారు. నారాయణ ప్రయత్నం ఫలిస్తుందా, వైసీపీ నేతలు చోస్తోందంతా తప్పుడు ప్రచారమేనని జనం నమ్ముతారా?
అసలేం జరిగింది..?
ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతం నీటమునిగిందంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ ప్రచారం అంటూ కూటమి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. మరి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫొటోలు, వీడియోల సంగతేంటని సామాన్య జనంలో అనుమానాలు అలాగే ఉన్నాయి. వాటిని క్లారిఫై చేసేందుకే మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో పర్యటించారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
నారాయణ వాదనేంటి..?
అమరావతిలో ఐకానిక్ టవర్స్ వద్ద నీరు చేరిన మాట వాస్తవమే అయినా టవర్స్ నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో నీరు నిలబడటంపై తప్పుడు ప్రచారం చేయడం దారుణం అంటున్నారు మంత్రి నారాయణ. అదే సమయంలో
వెస్ట్ బైపాస్ రోడ్ వద్ద నిర్మించిన బ్రిడ్జ్ కింద మట్టి నిలబడిందని, దానివల్ల కొండవీటి వాగు ప్రవాహానికి అది అడ్డుగా మారిందని, ఆ నీరు వెనక్కి తన్నడం వల్ల నీరుకొండ ప్రాంతంలో వరద వచ్చినట్టు కనపడుతోందని అంటున్నారు నారాయణ. సీఆర్డీఏ అధికారులు అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఆ నీరంతా ఇప్పుడు తొలగిపోయిందని చెబుతున్నారు.
శాపనార్థాలు..
అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి నారాయణ. ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడుతున్నారని, ధైర్యముంటే అమరావతికి వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలన్నారు. అమరావతికి వచ్చి మాట్లాడాలన్నారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారం వల్ల రాజధానికి వచ్చిన నష్టమేమీ లేదని నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి-31 నాటికి రాజధానిలో 4వేల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, ఆ ఇళ్లను అధికారులకు అప్పగిస్తామని చెప్పారు నారాయణ. వైసీపీ దుష్ప్రచారం ఆపకపోతే ప్రజలే ఛీకొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి ఆ 11 సీట్లు కూడా పోయి సున్నాకి చేరుకుంటారని మండిపడ్డారు. నారాయణ అమరావతి పర్యటన తర్వాత వైసీపీ నుంచి పెద్దగా విమర్శలు రాకపోవడం ఇక్కడ విశేషం. వాస్తవాలన్నిటినీ మీడియాను తీసుకెళ్లి నారాయణ చూపించడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.
నారాయణ నష్టనివారణ చర్యలు ఏమేరకు సఫలం అవుతాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమరావతి మునిగిపోయిందంటూ ఆల్రడీ వైసీపీ బ్యాచ్ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది. దీన్ని జనం నమ్ముతారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. అమరావతిపై విమర్శలకు వైసీపీకి ఓ అవకాశం దొరికిందని చెప్పాలి. అదే సమయంలో అమరావతిని విమర్శిస్తున్న వైసీపీ, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేలేకపోతోంది. తాము అధికారంలోకి వస్తే అమరావతిని ఏం చేస్తామనేదానిపై ఆ పార్టీకే క్లారిటీ లేదు. సో ఈ విషయంలో వైసీపీ విమర్శలను పట్టించువాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.