Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇటీవల తరచూ వార్తలలో నిలుస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కు అందుకున్నారు. ఇకపోతే గత రెండు రోజుల క్రితం రాహుల్.. హరిణ్య రెడ్డి (Harinya Reddy) అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థపు వేడుకలు ఎంతో అందంగా వైభవంగా జరిగాయి. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ప్రయాణం అంటూ చెప్పుకు వచ్చారు.
కన్యాకుమారిలో రాహుల్ ప్రత్యేక పూజలు..
ఇలా నిశ్చితార్థం జరిగిన వెంటనే రాహుల్ కన్యాకుమారికి వెళ్లారని తెలుస్తోంది. కన్యాకుమారిలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి వీడియోలను ఈయన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇలా నిశ్చితార్థం జరిగిన వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో ఇది కాస్త వైరల్ అవుతోంది.
సింగర్ గా రాహుల్ సినీ ప్రస్థానం..
ఇక రాహుల్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న ఈయన పలు సినిమాల పాటలకు కోరస్ పాడుతూ.. అనంతరం ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో పాటలను పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు పొందారు.
ఒక పాటతో ఆస్కార్ స్థాయి గుర్తింపు..
ఇక రాహుల్ సిప్లిగంజ్ పాడిన “నాటు నాటు” పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న రాహుల్ పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
రాహుల్ ప్రేమాయణం..
ఇకపోతే ఈయన బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా వెళ్లిన రాహుల్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు..ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన మరొక కంటెస్టెంట్ పునర్నవితో ప్రేమాయణం నడిపారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కూడా అంతే చనువుగా ఉండడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. అనంతరం రతిక రోజ్ (Rathika Rose)తో కూడా ఈయన ఎంత చనువుగా ఉండడంతో ఈ జంట వీరిద్దరి డేటింగ్ రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. ఇలా లవ్ ఎఫైర్స్ అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన రాహుల్ ఎవరూ ఊహించని విధంగా ఓ రాజకీయ నాయకుడి కుమార్తె అయిన హరిణ్యను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో అందరూ షాక్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ: Ragile Ragile Song: రగిలే రగిలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!