BigTV English

Pushpa 2 Movie : బౌండరీ దాటావ్ సుక్కు… అవసరమా మనకు ఇవి

Pushpa 2 Movie : బౌండరీ దాటావ్ సుక్కు… అవసరమా మనకు ఇవి

Pushpa 2 Movie : ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒకసారి కొత్త దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ప్రూవ్ చేసి సక్సెస్ కొట్టాడు సుకుమార్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా జగడం అనే సినిమా చేసే ప్రయత్నం చేశాడు. కానీ దిల్ రాజు చెప్పిన కొన్ని చేంజెస్ వలన హీరో రామ్ జగడం సినిమా చేసేసాడు. ఆ సినిమాలో వైలెన్స్ గురించి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు సుక్కు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. సుకుమార్ వైఫ్ కు కూడా ఈ సినిమా ఒక ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే చూడడానికి కూడా చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఒక సుకుమార్ సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సుకుమార్ చేసిన సినిమా ఫెయిల్ అయినా కూడా దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది.


ఇక ప్రస్తుతం సుకుమార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని మించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నారు. ఒక పుష్ప సినిమా సుకుమార్ కెరీర్ కి ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా గా వచ్చిన పుష్ప 2 కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకుంటుంది. ఇకపోతే సుకుమార్ చేసిన ఈ సినిమా కంప్లీట్ గా ఆయన జోనర్ ని మించి ఉంది అని చెప్పాలి. సుకుమార్ సినిమాలో హీరోలు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తారు. అలానే సుక్కు సినిమాలలో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. పుష్ప సినిమా మినహాయిస్తే రంగస్థలం సినిమా వరకు సుకుమార్ సినిమాల్లో హీరోలు అంతా కూడా చాలా అందంగా కనిపిస్తారు. చాలా స్టైలిష్ గా ఉంటారు. పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ చేసేసాడు సుకుమార్.

ఇక ప్రస్తుతం సుకుమార్ తన పంథాను వదిలిపెట్టి, నెక్స్ట్ లెవెల్లో సినిమాలు చేయడం మొదలు పెడుతున్నాడు. కానీ సుకుమార్ కు ఉన్న ఫ్యాన్స్ మాత్రం సుక్కు కైండ్ ఆఫ్ సినిమాలను మిస్ అవుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ రామ్ చరణ్ తేజ్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన రంగస్థలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా రంగస్థలం. సుకుమార్ కెరియర్ లో కూడా దీనిని బెస్ట్ ఫిలిం అని కొంతమంది చెబుతూ ఉంటారు. తరువాత రామ్ చరణ్ నటించిన బోయే సుక్కు సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ తాను కూడా ఒకటి చూశానని, అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని ఒక సందర్భంలో ఎస్ఎస్ రాజమౌళి కూడా తెలిపాడు.


Also Read : Allu Arjun : అప్పుడు పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు… మరి ఇప్పుడు బన్ని పరిస్థితేంటి..?

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×