E-Paper
Advertisement

Jagan: నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్.. విచారణ తర్వాత లోటస్‌పాండ్‌‌కు పయనం, మళ్లీ రప్పా రప్పా పోస్టర్లు

Jagan:  నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్.. విచారణ తర్వాత లోటస్‌పాండ్‌‌కు పయనం, మళ్లీ రప్పా రప్పా పోస్టర్లు
Advertisement

Jagan: ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టులో హాజరయ్యారు మాజీ సీఎం జగన్. దాదాపు అరగంటపాటు ఆయన న్యాయస్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. జగన్ న్యాయస్థానానికి వచ్చే సమయంలో 2029లో రప్పా రప్పా అంటూ వైసీపీ అభిమానులు పోస్టర్లు ప్రదర్శించారు.

ఆరేళ్ల తర్వాత న్యాయస్థానానికి జగన్

Advertisement

న్యాయస్థానం ఆదేశాలతో జగన్ హాజరయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. విదేశీ పర్యటన పిటిషన్‌లోనే జగన్ కోర్టుకు వచ్చారని తెలిపారు. న్యాయస్థానం ముందు జగన్ హాజరుకావడంతో ఆయన విదేశీ పర్యటన పిటిషన్ క్లోజ్ చేసింది. జగన్ కోర్టుకి హాజరైన సమయంలో ఎలాంటి విచారణ జరగలేదన్నారు.

చివరిసారిగా 2020 జనవరి 10న న్యాయస్థానానికి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట ఆయన హాజరయ్యారు. గురువారం ఉదయం 11.40 నుంచి 12.15 వరకు లోపల ఉన్నారు. దాదాపు అరగంటపాటు ఆయన కోర్టు లోపల ఉన్నారు.

Advertisement

అరగంటపాటు కోర్టు లోపల జగన్

ఆ సమయంలో ఆక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నేరుగా న్యాయస్థానానికి హాజరు కావాలని కోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయన అటెండయ్యారు. లోటస్ పాండ్‌లోని తన ఇంటికి నుంచి నేరుగా సాయంత్రం బెంగుళూరు చేరుకోనున్నారు మాజీ సీఎం.

జగన్ వెంట వైసీపీకి చెందిన ముగ్గురు నేతలున్నారు. పెద్దిరెడ్డి, పేర్నినానితోపాటు మరొకరు ఉన్నారు. పేర్ని నాని, మరో ముగ్గురు నేతలను న్యాయస్థానం లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో గేటు వద్ద ఉండిపోయారు. జగన్ తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఇంటికి చేరుకున్నారు. లోటస్‌పాండ్‌లోని వద్ద జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు-అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. తమపై పోలీసులు లాఠీ‌ఛార్జ్ చేస్తున్నారటూ ఆందోళనకు దిగారు వైసీపీ కార్యకర్తలు. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు.

ALSO READ:  తిరుమలలో రాష్ట్రపతి ముర్ము పర్యటన, కట్టదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు

జగన్ న్యాయస్థానానికి వచ్చే సమయంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు ఆవరణలో గుంపులు గుంపులుగా చేరి నినాదాలు చేశారు. అంతేకాదు 2029లో రప్పా రప్పా అంటూ జగన్ బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు.  వాటిని చూస్తూ.. అభిమానులకు నమస్కారం పెడుతూ ముందుకు సాగారు వైసీపీ అధినేత.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×