E-Paper
Advertisement

Jagan Comments: ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది : జగన్

Jagan Comments: ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది : జగన్
Advertisement

Jagan Comments on Chandrababu(AP political news): ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సీఎంగా పని చేసే వ్యక్తికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందంటూ ఆయన గుర్తు చేశారు. అధికారం ఉంది కదా అని చంద్రబాబు విలువలకు తిలోదకాలు ఇచ్చి దారుణాలకు పాల్పడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘బుధవారం జరిగిన విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్యాయంగా వ్యవహరించింది. మెజారిటీ లేని చోట ప్రలోభాలకు గురిచేశారు. పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. రాబోయే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 600 మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది, టీడీపీకీ కేవలం 200 మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నా కూడా పోటీకి సై అంటున్నది. ఎందుకంటే మెజారిటీ లేకున్నా దొడ్డి దారిన గెలిచేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు చాలా కీలకంగా ఉండబోతుంది. అధికార, ధనబలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ డబ్బుతో కొనలేరన్న సంకేతాలను ఈ ఎన్నికలతో చాటి చెప్పాలి.

Advertisement

Also Read: కందిపప్పు కోసం ఢిల్లీకి వచ్చాం: మంత్రి నాదెండ్ల

రాబోయే రోజుల్లో వైసీపీ శ్రేణులు ప్రజలకు మరింతగా చేరువై పని చేయాలి. అలా చేస్తే చంద్రబాబును ప్రజలే నామరూపాల్లేకుండా చేస్తారు. ఏపీలో జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే బిర్యానీ పెడుతానంటూ మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’ అంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×