Big Stories

AP CM Jagan : కుప్పానికే నీళ్లు ఇవ్వలేదు.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు..

AP CM Jagan : పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. పల్నాడుకు కృష్ణా జలాలు అందించబోతున్నామన్నారు. పల్నాడు రూపురేఖ­లను సమూ­లంగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. టీడీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని జగన్ స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందిస్తామన్నారు. పౌరుషాల పల్నాడును అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతోపాటు మహిళా సాధికారితకు కృషి చేశామని చెప్పారు. రూ.2 లక్షల 40 వేల కోట్ల నిధులు మహిళల ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామన్నారు. కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామని వివరించారు.

- Advertisement -

కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆపలేదని జగన్ చెప్పారు.చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. టీడీప పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి చంద్రబాబు ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? అని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా? అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News